ముద్దు వివాదం.. ఫ్యాన్స్ పై ప్రేమ తెలియజేస్తూనే అలా చేశా: ఉదిత్
దీంతో సోషల్ మీడియాలో ఉదిత్ పై విమర్శిస్తూ పెట్టిన పోస్టులే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఉదిత్ నారాయణ్ స్పందించారు.
By: Tupaki Desk | 1 Feb 2025 11:53 AM GMTమ్యూజికల్ కాన్సర్ట్ లో ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు రాగా పెదవిపై ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు పెట్టడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఉదిత్ నారాయణ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. దిగ్గజ సింగర్ అయిన ఆయన ప్రవర్తించిన తీరుపై ఫుల్ గా ఫైర్ అవుతున్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఉదిత్ పై విమర్శిస్తూ పెట్టిన పోస్టులే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఉదిత్ నారాయణ్ స్పందించారు. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్దు వివాదంపై మాట్లాడారు. ఫ్యాన్స్ పై తనకు ఉన్న ప్రేమను తెలియజేసేందుకు అలా చేశానని తెలిపారు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పారు.
ఎంతోమందికి తాను చాలా ఇష్టమని తెలిపిన ఉదిత్.. వారంతా తమ ఇష్టాన్ని తెలియజేయడానికి పలు విధాలుగా ట్రై చేస్తుంటారని అన్నారు. అలా కొందరు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తారని, మరికొందరు కిస్ చేయాలని అనుకుంటారని తెలిపారు. అదంతా ఆత్మీయతతో కూడుకున్న విషయం మాత్రమేనని పేర్కొన్నారు.
ఏదేమైనా తాను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తినని తెలిపారు ఉదిత్. ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం లేదని అన్నారు. సమాజంలో తనకు మంచి పేరు ఉందని, అందుకే ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటానని తెలిపారు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని కొందరు కావాలనే పెద్ద వివాదంగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక కెరీర్ విషయానికొస్తే.. ఉదిత్ నారాయణ్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ అందించారు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తన సాంగ్స్ తో చెరగని ముద్ర వేసుకున్నారు. అదే సమయంలో టాలీవుడ్ లో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఎన్నో అదిరిపోయే తెలుగు పాటలు ఆలపించారు.
అప్పుడప్పుడు మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా రీసెంట్ గా ముంబైలో జరిగిన కార్యక్రమంలో మోహ్రలోని టిప్ టిప్ బర్ సా పాట పాడారు. ఆ సమయంలో కొంతమంది మహిళా అభిమానులు సెల్ఫీ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ తో వేదిక వద్దకు వచ్చారు. అప్పుడే వారికి కిస్ చేసి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు ఉదిత్ నారాయణ్. ఆ తర్వాత తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు.