Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై గద్దర్ చివ‌రి చిత్రం!

ఈ సంద‌ర్భంగా `ఉక్కు స‌త్యా గ్రహం` టైటిల్ తో విశాఖ ఉక్కు ను దేశ వ్యాప్తంగా సినిమా రూపంలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 1:30 AM GMT
విశాఖ ఉక్కుపై గద్దర్ చివ‌రి చిత్రం!
X

ప్ర‌జాగాయ‌కుడు గద్దర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గద్దర్ పేరిట సినీ అవార్డులు ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యించింది. ఆ రకంగా క‌ళారంగానికి గద్దర్ చేసిన సేవ‌లు స్మ‌రించుకోవాలని పిలుపు నిచ్చి ముందుకెళ్తుంది. ఆయ‌న గాత్రం నుంచి క‌లం నుంచి జాలువారిన పాట‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తీ పాట‌లోనూ పోరాట ప‌టిమ క‌నిపిస్తుంది. అందుకే ప్ర‌జాగాయ‌కుడు అయ్యారు. చివ‌రిగా వెళ్తూ వెళ్తూ కూడా ప్ర‌జ‌ల కోస‌మే నా గొంతుక‌ని విశాఖ ఉక్కుపై గ‌ళ‌మెత్తారు.

కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ ఉక్క‌ను ప్ర‌యివేటీక‌ర‌ణ అమ‌లు దిశ‌గా అడుగులేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా `ఉక్కు స‌త్యా గ్రహం` టైటిల్ తో విశాఖ ఉక్కు ను దేశ వ్యాప్తంగా సినిమా రూపంలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసారు. స‌త్యారెడ్డి స్వీయా ద‌ర్శ‌క‌, నిర్మాణంలో ఈసినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో గద్దర్ మూడు పాట‌లు పాడారు. అలాగే కొన్ని సందేశాత్మ‌క స‌న్నివేశాల్లోనూ న‌టించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ కూడా ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. గద్దర్ చివ‌రి సినిమా ఇదే.

గ‌త ఏడాది గద్దర్ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఈ సినిమా చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అంటూ పోరాటం చేస్తున్న స‌మ‌యంలో ఈ సినిమాని తెర‌పైకి రావ‌డం...అందులో కి గద్దర్ ఎంట‌ర్ అవ్వ‌డం అన్న‌ది అంతా వేగంగా జ‌రిగిపోయింది. ఆయ‌న ఎంట్రీతో సినిమా స్థాయి మారింది. గద్దర్ రాక‌తో సినిమాకి మంచి క్రియేట్ అయింది. ప్ర‌జా గాయ‌కుడే పాట‌లు పాడ‌టంతో పాటు న‌టించ‌డంతో? ఈ సినిమా జ‌నాల్లోకి బ‌లంగా వెళ్తుంద‌ని భావించారు.

కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వ‌కుండా గద్దర్ క‌న్ను మూయ‌డం తీరిన శోకానికి గురి చేసింది. నటుడిగా, గాయ‌కుడిగా గద్దర్ చివ‌రి సినిమా ఇదే. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా గద్దర్ కుమార్తె వెన్నెల తండ్రి గురించి కొన్ని విష‌యాలు పంచుకున్నారు. `గద్దర్ అన్న గారు హైదరాబాద్ నుంచి విశాఖ కు బయల్దేరి మళ్ళీ ఇంటికొచ్చే వాళ్ళు. ఈ సినిమా కోసం ఆయన చాలా సమయం కేటాయించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశ్యం. ఎవరైతే తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్ ని అభివృది చేసారో? వాళ్ళ కోసం ఈ సినిమా చేసారు గద్దర్. ఆయన ఈ సినిమా లో న‌టించ‌లేదు. జీవించారు` అని అన్నారు.