అర్జున్ కి షాకిచ్చిన కుమార్తె ఐశ్వర్య!
కోలీవుడ్ ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరై నూతన వధువూరులను ఆశీర్వదించారు.
By: Tupaki Desk | 17 Jun 2024 5:42 AM GMTయాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె, నటి ఐశ్వర్య వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబిరామయ్య కుమారుడు, యువ నటుడు ఉమాపతి- ఐశ్వర్య కొన్నాళ్లగా ప్రేమించుకున్నారు. ఇరువురు పెద్దల్ని ఒప్పించి ఇటీవలే వివాహ బంధంతో ఒకటయ్యారు. సంగీత్, పెళ్లి, రిసెప్షన్ కార్యక్రమంలో ఎంతో వైభవంగా జరిగాయి. కోలీవుడ్ ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరై నూతన వధువూరులను ఆశీర్వదించారు.
అయితే ఈ వివాహం గురించి ఇంతవరకూ అర్జున్ ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా పెళ్లి అనంతరం అర్జున్ మీడియాతో మాట్లాడారు. `తంబిరామయ్యది మంచి సంప్రదాయ కుటుంబం. ఆ మధ్య ఓటీవీషోకి హోస్ట్ గా చేసారు. అందులో ఉమాపతి కూడా కంటెస్ట్ గా చేసాడు. అప్పుడే ఉమాపతి బాగా నచ్చాడు. ఓ రోజు నా కుమార్తె నాతో ఒంటరిగా మాట్లాడలని అడిగింది. అప్పుడే అనుకున్నా ఇదేదో ప్రేమ వ్యవహారం అయి ఉంటుందని. ఉమాపతి పేరు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను.
ఆ తర్వాత ఉమాపతితో నేను కట్టించిన ఆంజనేయ స్వామి అలయం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. తెలిసిన కుర్రాడు, మంచోడు కావడంతో నేను కూడా అడ్డు చెప్పలేదు. వాళ్ల ప్రేమను గౌరవించి పెళ్లికి ఒకే చెప్పాను` అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పెళ్లి తర్వాత ఐశ్వర్య సినిమాలు చేస్తుందా? అంటే? జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంది. సినిమాలు చేయాలా? వద్దా? అన్నది కూడా ఆమె నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
ఐశ్వర్యని పెద్ద హీరోయిన్ ని చేయాలని అర్జున్ చాలా ప్రయత్నాలు చేసారు. కానీ ఆమె ఎందుకనో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేదు. అందం..అభినయం...వెనుక మంచి ట్రైనర్ ఉన్నా ఐశ్వర్య సక్సెస్ అవ్వలే దు. నటిగా రెండు సినిమాలు చేసి పరిశ్రమకు దూరమైంది. గత ఏడాది టాలీవుడ్ లో కూడా లాంచ్ చేయా లని చూసారు కానీ..ఆ ప్రాజెక్ట్ వివాదాలతో ఆగిపోయిన సంగతి తెలిసిందే.