Begin typing your search above and press return to search.

మోహన్ లాల్ సినిమాకు అనుకోని చిక్కులు..!

ఐతే మోహన్ లాల్ లేటెస్ట్ గా బరోజ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడం విశేషం.

By:  Tupaki Desk   |   8 Aug 2024 10:30 PM GMT
మోహన్ లాల్ సినిమాకు అనుకోని చిక్కులు..!
X

ఈమధ్య స్టార్ సినిమాకు కాపీ కథ.. లేదా స్పూర్తి గా తీసుకున్నారంటూ సంబంధిత రైటర్స్ నుంచి గొడవలు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇప్పటికీ తెలుగులో ఒక స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాకు సంబంధించిన ఒక కథ తనదే అంటూ రైటర్ వేసిన కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. ఐతే ఇప్పుడు మళ్లీ అలాంటిదే స్టార్ హీరో మోహన్ లాల్ సినిమా కథ గురించి లీగల్ ఇష్యూస్ దాకా వెళ్లిందని టాక్. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా సినిమా చేస్తున్నారు అంటే దాని గురించి ఆయన ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

ఐతే మోహన్ లాల్ లేటెస్ట్ గా బరోజ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడం విశేషం. ఐతే ఈ సినిమా కథ తాను రాసుకున్న నవల ఆధారంగా చేసుకుని తీస్తున్నారంటూ జార్జ్ తుండిపరంబిల్ అనే రైటర్ లీగల్ నోటీసులు జారీ చేశాడు. తాను రాసుకున్న మాయ నవల ఆధారంగా బరోజ్ వస్తుందని. కప్పిరి ముత్తప్పన్ గురించి ఈ నవల రాశానని.. అప్పట్లోనే ఈ నవల నచ్చి మోహన్ లాల్ కు సన్నిహితుడైన రైటర్ రవికుమార్ తో సినిమా చేయాలని అనుకున్నారని.. ఐతే అప్పట్లోనే వర్క్ మొదలు పెట్టగా ఆ తర్వాత సినిమా ఆపేశారు.

కానీ మళ్లీ ఇన్నాళ్లకు బరోజ్ గా ఆ సినిమా మొదలు పెట్టారని. తన కథ వాడుకున్నందుకు తనకు ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని. దానికి పరిహారం చెల్లించాలంటూ ఫిర్యాదులో రైటర్ జార్జ్ రాసుకొచ్చారు. ఐతే మోహన్ లాల్ సినిమాకు ఇలా లీగల్ ఇష్యూస్ రావడం అది కూడా ఆయన డైరెక్ట్ చేస్తున్న సినిమాకు రావడం స్టార్ హీరో ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది.

మోహన్ లాల్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న సినిమాకు ఇలాంటి లీగల్ సమస్యలు ఎవరు ఊహించలేదు. ఐతే రైటర్ జార్జ్ తో బరోజ్ టీం సంప్రదింపులు చేస్తున్నారని సమస్య కోర్ట్ లో కాకుండా సామరస్యపూర్వకంగానే పరిష్కరిస్తారని మలయాళ మీడియా చెబుతుంది. మోహన్ లాల్ బరోజ్ మైథలాజికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాకు అనూహ్యంగా లీగల్ సమస్య రావడం సినీ ప్రియులను షాక్ అయ్యేలా చేస్తుంది.