హీరో విజయ్ కు Y+ కేటగిరీ సెక్యూరిటీ
తమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడులో తమిళగ వెట్రి కళగం అనే పార్టీని పెట్టి పూర్తి స్థాయి రాజకీయాలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Feb 2025 8:49 AM GMTతమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడులో తమిళగ వెట్రి కళగం అనే పార్టీని పెట్టి పూర్తి స్థాయి రాజకీయాలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పార్టీని అనౌన్స్ చేస్తున్న టైమ్ లోనే విజయ్ 2026లో తమిళనాడులో జరిగే ఎన్నికల బరిలో పోటీ చేస్తామని ప్రకటించాడు. అందులో భాగంగానే ప్రజలకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన తన ఓపీనియన్ ను సూటిగా చెప్తున్నాడు.
ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ కు సంబంధించి కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. విజయ్ కు Y+ కేటగిరీ భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగానే విజయ్ కు కేంద్రం ఈ భద్రతను కల్పించింది. అయితే ఇది దేశంలోనే నాలుగో అత్యున్నత స్థాయి భద్రత.
మొదటి భద్రతా విభాగం SPG. ఇది ప్రధాని, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతికి కల్పిస్తారు. పదవి, వారికి ఎదురయ్యే భద్రతను బట్టి అందులో భద్రతా సిబ్బంది ఉంటారు. SPG తర్వాత రెండో కేటగిరీ Z+ కేటగిరీ. మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులతో పాటూ తీవ్ర ప్రమాదం పొంచిఉన్న నాయకులకు కూడా ఈ భద్రత కల్పిస్తారు.
Z+ తర్వాత Z కేటగిరీ భద్రత మూడోది. ఇక నాలుగోది కేంద్ర ప్రభుత్వం విజయ్ కు ఇచ్చిన Y+ కేటగిరీ భద్రత. ఈ భద్రతలో మొత్తం 11 మంది ఉంటారు. నలుగురు కమెండోలు, మిగిలిన వారు పోలీసులు ఉంటారు. సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, షారుఖ్ ఖాన్‌కు ఈ భద్రత ఉంది. దీనికి సుమారు నెలకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది.