అదే జరిగితే వాళ్లంతా షట్టర్ బంద్ చేయాల్సిందే!
భారత లో ప్రయివేట్ టెలివిజన్ ఛానెల్స్, కార్పోరేట్ ఓటీటీలు ఏ రేంజ్ లో బిజినెస్ చేస్తున్నాయో తెలిసిందే.
By: Tupaki Desk | 4 July 2024 10:30 AM GMTభారత లో ప్రయివేట్ టెలివిజన్ ఛానెల్స్, కార్పోరేట్ ఓటీటీలు ఏ రేంజ్ లో బిజినెస్ చేస్తున్నాయో తెలిసిందే. ఆ వేదికలపై దొరకని ఎంటర్ టైన్ మెంట్ ఏదీ లేదు. వినోదం, వార్తలు, క్రీడలు, డాక్యుమెం టరీలు ఇలా ఎన్నో రకాల సౌలభ్యం వాటిలో ఉంది. సబ్ స్క్రిప్షన్ పేరుతో ఛార్జీలు భారీగానే బాదుతు న్నాయి. అయితే వాటికి చెక్ పెట్టేలా ప్రభుత్వ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.
ప్రభుత్వమే సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ లను తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది. ముఖ్యంగా స్పోర్స్ట్ ని ఉచితంగా ప్రేక్షకులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇదే జరిగితే బడా కార్పోరేట్ లైవ్ ఛానెల్స్ అన్నింటికీ అదే చివరి రోజు అవుతుందని లైవ్‌మింట్‌తో సంబంధం ఉన్న ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఇది అందుబాటులోకి వస్తే గనుక ప్రయివేట్ ప్రసారకర్తలపై ప్రభావం పడుతుందన్నారు.
దీంతో ఆయా యాజమాన్యల్లో అప్పుడే గుబులు మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రసార భారతిలో స్పోర్స్ట్ అందుబాటులోకి రాకూడదని రాజకీయ చర్యలకు దిగినట్లు వినిపిస్తుంది. క్రీడా హక్కులనేవి చాలా కాలంగా జాతీయ, అంతర్జాతీయ ఛానళ్లకు ఎక్కువ కాలం పాటు ప్రీమియంతో విక్రయించబడుతున్నాయి. అందులోనూ క్రికెట్ లాంటి ఆట కి విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఒకే రోజు కోట్లాది మంది వీక్షిస్తున్నారు.
ఇది ఆయా సంస్థలకు భారీగా లాభాలు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వమే క్రికెట్ లాంటి గేమ్ ల్ని ఉచిత లైవ్ ప్రోగ్రామ్ అందుబాటులోకి తేస్తే ప్రయివేట్ సంస్థలన్నీ మూత పడాల్సిందే. ప్రస్తుతం డిస్నీ స్టార్ 2027 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్‌లను ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంది. అలాగే వయోకామ్ 18 సంస్థ 2028 వరకు బీసీసీ హక్కుల్ని కలిగి ఉంది.
కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ రైట్స్ తొలగించి ప్రభుత్వమే ఉచితంగా లైవ్ ఇవ్వడం అన్నది జరిగేది కాదు. అందుకు చాలా సమయం పడుతుంది. ఇంతవరకూ ప్రభుత్వం కూడా దీని గురించి ఎక్కడా ధృవీకరించలేదు.