ఏడు పదుల వయసులో ఏంటి ఈ జోరు సారు..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్' సినిమా కమల్ హాసన్ ని పాతికేళ్లు వెనక్కి తీసుకు వెళ్లినట్లుగా పరిస్థితులు మారిపోయాయి
By: Tupaki Desk | 8 Nov 2023 12:58 PM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ సినీ కెరీర్ ఖతం అయింది.. ఆయన ఎలాగూ రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాడు కనుక ప్రజా సేవకి అంకితం అవుతాడేమో అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాజకీయాలు కాకుండా ఆయన వరుసగా సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు ఆయన డైరీ లో ఉన్నాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్' సినిమా కమల్ హాసన్ ని పాతికేళ్లు వెనక్కి తీసుకు వెళ్లినట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు కమల్ ఎంత బిజీగా వరుసగా సినిమాలు చేసేవాడో ఇప్పుడు కూడా అలాగే వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ఏడు పదుల వయసు లో కమల్ హాసన్ జోరు చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు.
ఈ వయసు లో సాధారణ జనాలు కనీసం నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ కమల్ మాత్రం వందల కోట్ల బడ్జెట్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్ మాత్రం చిన్నా చితకా సినిమాలు కాకుండా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఇండియన 2 మరియు ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న కమల్ హాసన్ ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ ను ప్రకటించాడు. మరో వైపు ఇండియన్ 3 సినిమా ఉంటుందని చెప్పిన కమల్ హాసన్ విక్రమ్ సీక్వెల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్న కమల్ హాసన్ మరీ ఇంత స్పీడ్ గా, ఇన్ని సినిమాలకు కమిట్ అవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ జోరు మరో పదేళ్ల పాటు కమల్ కొనసాగిస్తాడని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతానికి రాబోయే మూడేళ్ల పాటు కమల్ డైరీ ఫుల్ గా ఉంది.
వచ్చే ఏడాది సమ్మర్ లో ఇండియన్ 2 సినిమా ను ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో కమల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆ సినిమా ను కూడా వచ్చే ఏడాది ప్రథమార్థం లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. 2025 లో మణిరత్నం థగ్స్ లైఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా 2027 వరకు కమల్ సినిమాల జోరు, జాతర కొనసాగబోతుంది.