Begin typing your search above and press return to search.

ఈ పాట వింటే ప్రేమలో పడిపోతారేమో!

తాజాగా ఈ చిత్రం నుంచి ఉన్నానో లేనో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట ఎంతో కూల్​గా మనసుకు హత్తుకునేలా ఉంది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 3:49 PM GMT
ఈ పాట వింటే ప్రేమలో పడిపోతారేమో!
X

టాలీవుడ్​ టాప్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు ఒకరు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై ఆయన సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తూనే.. మరోవైపు కొత్త టాలెంట్​ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాబోతున్న మరో కొత్త చిత్రం ఆకాశం దాటి వస్తావా. నృత్య దర్శకుడు యష్‌ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు ప్రొడక్షన్‌లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.


మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఉన్నానో లేనో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట ఎంతో కూల్​గా మనసుకు హత్తుకునేలా ఉంది. కార్తిక్ అందించిన మ్యూజిక్ ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆయనే స్వయంగా ఈ పాటను ఆలపించారు. ఆయన పాడిన విధానం ఎంతో వినసొంపుగా ఉంది. భరద్వాజ్ పాత్రుడు బ్యూటిఫుల్ లిరిక్స్ అందించారు. ఓ పర్ఫెక్ట్ లవ్ ఆంథమ్​లా ఉంది.

సాంగ్​లో యశ్-కార్తికా మురళిధరన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఈ పాట వింటుంటే.. కచ్చితంగా ప్రతిఒక్కరూ ప్రేమలో పడతారు అనిపించేలా ఉంది. ఇకపై తప్పుకండా ప్రతిఒక్కరూ ప్లే లిస్ట్ లో చార్ట్ లో ఉంటుందని చెప్పొచ్చు. అంత అద్భుతంగా అనిపించిందీ పాట.

ఇకపోతే ఈ సినిమాకు శశి కుమార్‌ ముతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక మురళీధరన్‌ కథానాయికగా నటిస్తోంది. ర్యాంపీ నందిగాం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్​కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీతో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమైంది. సంగీతానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు.

నేటి యువతరాన్ని ఆకట్టుకునే అంశాలతో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. జీవితంలో ప్రేమ, సమయం, డబ్బులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ బంధంలో గొడవలు జరుగుతాయి. ఆ నేపథ్యంతోనే సినిమాను మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిస్తున్నామని మూవీటీమ్ చెబుతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో..