Begin typing your search above and press return to search.

నానిపై అనవసరమైన ట్రోల్స్.. ముంబైలో ఏం జరుగుతోంది?

దీంతో వార్సీ పేరు ఎత్తకుండా నవ్వుతూనే గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ వ్యక్తి జీవితంలో ఇదే అతి పెద్ద పబ్లిసిటీ అయి ఉంటుందని ఎద్దేవా చేశారు నాని.

By:  Tupaki Desk   |   22 Aug 2024 11:06 AM GMT
నానిపై అనవసరమైన ట్రోల్స్.. ముంబైలో ఏం జరుగుతోంది?
X

నేచురల్ స్టార్ నాని ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా మూవీ సరిపోదా శనివారం రిలీజ్ అవుతున్న సందర్భంగా వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా చాలా క్లియర్ గా ఆన్సర్లు ఇస్తున్నారు. తెలుగు, తమిళం తర్వాత ఇప్పుడు మాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఆ తర్వాత శాండల్ వుడ్, బాలీవుడ్ లో సందడి చేయనున్నారు.

అయితే టాలీవుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల నాని.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా అటెండ్ అయ్యారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయాన్ని ప్రస్తావించారు. దీంతో వార్సీ పేరు ఎత్తకుండా నవ్వుతూనే గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ వ్యక్తి జీవితంలో ఇదే అతి పెద్ద పబ్లిసిటీ అయి ఉంటుందని ఎద్దేవా చేశారు నాని.

మీడియా కూడా అనవసరంగా ఆ అంశాన్ని హైలైట్ చేస్తున్నట్లు భావిస్తున్నానని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నార్త్ కు చెందిన కొందరు నెటిజన్లు నానిని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తమ హద్దులు దాటి అవమానకరంగా ట్వీట్స్ చేస్తున్నారు. తమకు నచ్చినట్లు పోస్టులు పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వేస్ట్ రీజన్ తో నాని పేరు.. ట్విట్టర్ వన్ డే ట్రెండింగ్ లిస్ట్ లో కనిపించింది.

అయితే నానిపై ట్రోల్స్ చేస్తున్న వారికి ఆయన ఫ్యాన్స్ కూడా గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. దీంతో నెట్టింట నార్త్ వర్సెస్ సౌత్ అన్నట్లు నడుస్తోంది. ఈ ధోరణి మంచిది కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా నానిపై ట్రోల్స్ చేయొద్దని కోరుతున్నారు. వార్సీ కామెంట్ చేస్తేనే.. నాని కౌంటర్ ఇచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో మరికొందరు సరిపోదా శనివారం హిందీ వెర్షన్ గురించి ప్రస్తావిస్తున్నారు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా హిందీలో కూడా Suryas Saturday పేరుతో ఆగస్టు 29వ తేదీనే రిలీజ్ కానుంది. దీంతో బీ టౌన్ లో నాని మూవీ వసూళ్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు చెబుతున్నారు. అదే సమయంలో నాని.. తన మూవీ టీమ్ తో ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లనున్నారు. దీంతో అక్కడి మీడియా నుంచి ఆయనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో, అప్పుడు నాని ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలని అంటున్నారు.