Begin typing your search above and press return to search.

సమంత హీరో 100 కోట్ల క్లబ్‌లోకి?

సినిమాలోని సన్నివేశాలు చాలా వారకు రక్తపాతంతో నిండి ఉన్నప్పటికీ ఓ వర్గం ఆడియెన్స్ ను మాత్రం థియేటర్స్ కు రప్పిస్తోంది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 5:16 AM GMT
సమంత హీరో 100 కోట్ల క్లబ్‌లోకి?
X

మాలీవుడ్ నుండి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఉన్ని ముకుందన్ మార్కోతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. హిందీ, తమిళ, తెలుగు వంటి పలు భాషల్లో విడుదలై, అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నెవ్వర్ బిఫోర్ అనేలా మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ గా హనీఫ్ ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చారు. సినిమాలోని సన్నివేశాలు చాలా వారకు రక్తపాతంతో నిండి ఉన్నప్పటికీ ఓ వర్గం ఆడియెన్స్ ను మాత్రం థియేటర్స్ కు రప్పిస్తోంది.

సమంతతో యశోద సినిమాలో నటించిన ఉన్ని ముకుందన్ నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. అంతకుమించి అతను జనతా గ్యారేజీలో విలన్‌గా కనిపించిన విషయం తెలిసిందే. ఎలాంటి పాత్ర చేసినా కూడా తన టాలెంట్‌ను చూపించారు. ఇప్పుడు ఈయన తన నటనతో యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొత్త హీరోగా ఎదుగుతున్నారు.

ముఖ్యంగా హిందీ వెర్షన్‌ లోనే ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 21 రోజుల్లో 10.7 కోట్లను రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద లెక్క ఏకంగా 100 కోట్లకు చేరువవుతుండడం విశేషం. 21 రోజుల్లో మార్కో 96.75 కోట్ల వసూళ్లతో అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో మొదట్లో కాస్త తక్కువ నెంబర్లు వచ్చినా ఆ తరువాత మెల్లగా పెంచుకుంటు వెళ్ళింది.

షేర్ పరంగా మార్కో సినిమా మొత్తం 56.95 కోట్లను వసూలు చేసి, 30 కోట్ల బడ్జెట్‌ను పూర్తిగా రికవర్ చేసుకుంది. 89% లాభంతో ఈ సినిమా మలయాళ పరిశ్రమలో 2024 చివరి హిట్‌గా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరిస్తే, ముఖ్యంగా హిందీ వెర్షన్ యొక్క లైఫ్‌టైమ్ కలెక్షన్లు 12 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది.

హిందీ బాక్సాఫీస్‌లో మార్కో 21వ రోజైన మూడవ గురువారం 0.50 కోట్లు వసూలు చేసింది. ఇది మూడవ బుధవారం వసూలైన 0.62 కోట్లతో పోలిస్తే 19% తగ్గుదల. మొదటి వారంలో కేవలం 0.28 కోట్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా, మూడవ వారంలో 5.82 కోట్ల భారీ కలెక్షన్లను సాధించి సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తోంది. మొదటి వారంతో పోలిస్తే మూడవ వారంలో ఊహించని విధంగా పెరగడం షాకింగ్ అనే చెప్పాలి.

ఒకప్పుడు ఇతర చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఉన్ని ముకుందన్‌కు ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు లభించింది. బాక్సాఫీస్ పరంగా బాలీవుడ్‌లో కూడా నిలదొక్కుకున్నాడు. మలయాళ పరిశ్రమ నుండి బాలీవుడ్ వరకు తన ప్రతిభను చాటుకుని, మంచి కథలతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఈ విజయంతో ఉన్ని ముకుందన్ కొత్త కథలపై దృష్టి సారించడమే కాకుండా, మరిన్ని భాషల్లో తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తాడని చెప్పవచ్చు. ముఖ్యంగా మార్కో విజయంతో మలయాళ సినీ పరిశ్రమలో ఉన్ని స్థానం మరింత బలపడింది.