Begin typing your search above and press return to search.

హీరో లైగింక వేధింపుల కేసు.. మరో షాకింగ్ ట్విస్ట్

మలయాళ నటులు డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Sep 2023 8:00 AM GMT
హీరో లైగింక వేధింపుల కేసు.. మరో షాకింగ్ ట్విస్ట్
X

మలయాళ నటులు డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి, మోహన్ లాల్, దసరా విలన్‌ షైన్ టామ్ చాకో.. ఇలా పలువురు తమ నటనతో ఇక్కడ అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఉన్ని ముకుందన్ ఒకరు. భాగమతిలో అనుష్కను ప్రేమించిన వ్యక్తిగా, జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కొడుకుగా, రివితేజ ఖిలాడీలో దోషిగా, సమంత యశోదలో యంగ్ డాక్టర్ గా ఆకట్టుకున్నారాయన.

అయితే ఉన్ని ముకుందన్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు తాజాగా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ లైంగిక వేధింపుల కేసును కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఇరు వర్గాలు(ముకుందన్, కేసు పెట్టిన మహిళ) పరస్పర సెటిల్‌మెంట్‌ చేసుకున్నారని తెలిసింది. కేసు పెట్టిన మహిళ తన ఆరోపణలను ఉపసంహరించుకుందట.

అసలేం జరిగిందంటే.. 2018లో కొట్టాయంకు చెందిన ఓ మహిళ.. తనను ఉన్ని ముకుందన్ లైంగికంగా వేధించారంటూ ఆ ఏడాది పోలీసులను ఆశ్రయించింది. సెస్టెంబర్ 15న ఆయనపై కేసు పెట్టింది. ఆ ఏడాది ఆగష్టు 23న స్టోరీ డిస్కషన్ కోసమని పిలిచి తనను ఉన్ని వేధించారంటూ సదరు మహిల ఫిర్యాదులో పేర్కొంది.

అయితే ఈ ఆరోపణలను.. ఉన్ని ముకుందన్ అప్పుడు తీవ్రంగా ఖండించారు. తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం కేసును వేశారు. ఈ కేసును కొట్టివేసి తనను నిర్దోషిగా ప్రకటించాలని.. మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఆ కోర్టు.. ఉన్ని పిటీషన్ ను కొట్టిపారేసి విచారణ ఎదుర్కోవాలని ఆదేశించింది.

ఆ తర్వాత ఉన్ని హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఇరు వర్గాలు సెటిల్‌మెంట్‌కు వచ్చాయని తెలుపుతూ.. ఉన్ని కోర్టులో స్టే పొందారు. అనంతరం కేసు పెట్టిన మహిళ తరఫు న్యాయవాది.. ఉన్ని.. నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారంటూ కోర్టులో మళ్లీ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం.. ఉన్నిని నిర్దోషిగా ప్రకటించాలన్న పిటీషన్ ను తిరస్కరించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ కేసు.. ఇప్పుడు మళ్లీ ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయంటూ.. కోర్టు కేసు కొట్టిపారేసినట్లు తెలిసింది.

ఇకపోతే చివరిసారిగా ఉన్ని.. మాలికాపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం మలయాళంలో భారీ సక్సెస్ అందుకుంది. ఒక్క మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. ఓటీటీలో కూడా మంచి విశేష అదరణ పొందింది.