Begin typing your search above and press return to search.

నవ సారధులతో అన్ స్టాపబుల్ 4 స్టార్ట్..?

ఐతే అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఈసారి సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.

By:  Tupaki Desk   |   18 Oct 2024 3:45 AM GMT
నవ సారధులతో అన్ స్టాపబుల్ 4 స్టార్ట్..?
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. 3 సక్సెస్ ఫుల్ సీజన్ లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో ఇప్పుడు నాలుగో సీజన్ కు రెడీ అవుతుంది. దీనికి సంబందించిన అనౌన్స్ మెంట్ కూడా ఈమధ్యనే వచ్చింది. ఐతే అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఈసారి సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈసారి షోలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలను కూడా గెస్ట్ లుగా తీసుకొస్తారని తెలుస్తుంది.

ఇదే కాకుండా ఏపీ నూతన ప్రభుత్వ రధ సారధులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కూడా అన్ స్టాపబుల్ సీజన్ 4 కి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ ఇదే అవుతుందని అంటున్నారు. ఐతే అంతకుముందు సీజన్ 3 లో చంద్రబాబు, లోకేష్ గెస్ట్ లుగా వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా అతిథిగా వచ్చి అలరించాడు.

కానీ ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఒకేసారి రాబోతున్నారట. కచ్చితంగా ఈ సీజన్ కి ఈ ఎపిసోడ్ అదిరిపోయే స్టార్టింగ్ అని చెప్పొచ్చు. ఏపీ రాజకీయాలు, సినిమాలు ఇలా అన్ని విషయాల గురించి బాలకృష్ణ స్పెషల్ చిట్ చాట్ క్రేజీగా మారబోతుంది. బాలయ్య అన్ స్టాపబుల్ షో చేసినప్పటి నుంచి ఆయన గురించి అందరికీ తెలిసింది. బాలయ్యలోని వేరే యాంగిల్ ని ఈ షో ప్రేక్షకులకు తెలిసేలా చేసింది.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే కె ఎస్ బాబీ డైరెక్షన్ లో NBK 109 సెట్స్ మీద ఉంది. సితార బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించుతున్నారు. ఇదే కాకుండా ఈమధ్యనే అఖండ 2 సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు బాలకృష్ణ. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న అఖండ 2 సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.