బాలయ్య - తారక్.. ఇంపాజిబుల్!
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది
By: Tupaki Desk | 20 Sep 2023 4:33 AM GMTఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఆహా హిస్టరీలో అన్నిటి కంటే ఈ టాక్ షోకి ఎక్కువ ఆదరణ లభించింది. బాలయ్య హోస్ట్ గా ఇతర సెలబ్రెటీలని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కావాల్సినంత ఫన్ తో పాటు బోలెడంత ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతోంది. ఈ కారణంగానే అన్ స్టాపబుల్ షోకి అదిరిపోయే ఆదరణ వస్తోంది.
ఇక ఈ షో సీజన్ 3ని స్టార్ట్ చేయాలని ఆహా టీమ్ ఆలోచిస్తోంది. దానికోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని పిలవాలని ఫిక్స్ అయ్యారు. చిరంజీవి కూడా వస్తానని మాట ఇచ్చారంట. బాలయ్య, చిరంజీవి మధ్యలో చిన్న మనస్పర్థలు ఉండటంతో వాటికి ఈ షోతో ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అలాగే సీజన్ 3 కోసం తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నారంట.
వీరితో పాటు రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్స్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ని కూడా అన్ స్టాపబుల్ సీజన్ 3లో ఒక ఎపిసోడ్ కోసం రప్పించే ప్రయత్నం చేస్తున్నారంట. చాలా కాలంగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కారణాలు తెలియదు కానీ కాస్తా దూరం అయితే ఉంది.
చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలు, అన్ స్టాపబుల్ షో గురించి ఆలోచించకుండా పూర్తిగా రాజకీయ వ్యవహారాలలో తలమునకలై ఉన్నారు. ఈ కారణంగా షో కూడా లేట్ అవుతోందంట. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. కనీసం కళ్యాణ్ రామ్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు.
టీడీపీ, నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్దిగా కోపంగా కూడా ఉన్నారు. అయితే తారక్ మాత్రం తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ఘటనపై స్పందించేందుకు కూడా సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితిలో బాబాయ్, అబ్బాయ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం అసాధ్యం అనే మాట వినిపిస్తోంది. ఒక వేళ పార్టిసిపేట్ చేసిన చాలా విషయాలపై చర్చించాల్సి వస్తుంది. వాటిపై ఓపెన్ గా మాట్లాడుతారా అనేది కూడా చెప్పలేని విషయం. అందుకే ఈ కాంబినేషన్ సాధ్యం కాదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.