Begin typing your search above and press return to search.

బ‌ట్ట‌లు విప్పుతావా? బోల్డ్ న‌టికి ప్ర‌పోజ‌ల్!

నిరంత‌రం హ‌ద్దుమీరిన‌ ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్లో సంచ‌ల‌నం సృష్టించే ఈ బ్యూటీ విలువ‌ను దిగజారుస్తూ ప్ర‌ముఖ బ్రాండ్ ప్ర‌తినిధులు పంపిన వాట్సాప్ చాట్ ప్ర‌పోజ‌ల్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.

By:  Tupaki Desk   |   12 Dec 2024 3:53 AM GMT
బ‌ట్ట‌లు విప్పుతావా? బోల్డ్ న‌టికి ప్ర‌పోజ‌ల్!
X

టీవీ మూవీ న‌టి, బోల్డ్ మోడ‌ల్ ఉర్ఫీ జావేద్‌ని వివాదాలు వీడ‌టం లేదు. నిరంత‌రం హ‌ద్దుమీరిన‌ ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్లో సంచ‌ల‌నం సృష్టించే ఈ బ్యూటీ విలువ‌ను దిగజారుస్తూ ప్ర‌ముఖ బ్రాండ్ ప్ర‌తినిధులు పంపిన వాట్సాప్ చాట్ ప్ర‌పోజ‌ల్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.

ఓరల్ హైజీన్ బ్రాండ్‌ ప్రచారం కోసం త‌న‌ను `బట్టలు విప్పమ`ని కోరిన‌ట్టు ఊర్ఫీ ఆరోపించారు. ఆ మేర‌కు ఆధారాల‌ను కూడా ఊర్ఫీ బ‌య‌ట‌పెట్టారు. మోడ‌ల్ కం న‌టి ఊర్ఫీ జావేద్ స‌ద‌రు ఉత్ప‌త్తి ప్ర‌తినిధుల‌తో వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌లను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. ``ఇలా అడ‌గ‌టం హానికరం.. అనుచితం`` అంటూ ఊర్ఫీ త‌న‌ నిరాశను వ్యక్తం చేసారు. తన కెరీర్‌లో అలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని.. వృత్తిపరమైన హ‌ద్దులు త‌న‌కు ఉన్నాయని కూడా ఊర్ఫీ తెలిపింది. అటువంటి డిమాండ్లకు త‌లొగ్గ‌లేన‌ని కూడా పేర్కొంది.

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో పాపుల‌ర్ ఓరల్ హైజీన్ బ్రాండ్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న కోసం త‌న‌ను బ‌ట్ట‌లు విప్పి అసైన్ మెంట్ లో పాల్గొనాల్సిందిగా స‌ద‌రు బ్రాండ్ కోరిన‌ట్టు ఊర్ఫీ ఆరోపించారు. బ్రాండ్‌లతో నా అన్ని అనుభవాలను స‌మీక్షిస్తే నేను ఇంత హానికరమైన ప్ర‌పోజ‌ల్‌ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. నా టీమ్ మిమ్మ‌ల్ని క‌లుస్తుంది. ప‌రిణామాల‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండండి! అని హెచ్చ‌రించారు.

అయితే స‌ద‌రు బ్రాండ్ అధికారిక ఇన్‌స్టాలో ఒక వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేసింది. తాము ఎవరినీ కించపరచాలని భావించడం లేదని .. గ‌డిచిన 24 గంట‌ల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఊహించ‌నివి అని వారు పేర్కొన్నారు. మా మాట‌ల‌ను త‌ప్పుగా అన్వ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. మేం వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి స‌మ‌యం కావాలి. మాట్లాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని బ్రాండ్ ప్ర‌తినిధులు సోష‌ల్ మీడియాల్లో ప్ర‌క‌టించారు.