Begin typing your search above and press return to search.

అంజ‌నాదేవికి పుట్టిన‌రోజుకి ఉపాస‌న స్పెష‌ల్ విషెస్

ఇదిలా ఉంటే ఇవాళ చిరంజీవి త‌ల్లి, రామ్ చ‌ర‌ణ్ నాన‌మ్మ అంజ‌నా దేవి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ ఫోటోను షేర్ చేసింది ఉపాస‌న.

By:  Tupaki Desk   |   29 Jan 2025 10:39 AM GMT
అంజ‌నాదేవికి పుట్టిన‌రోజుకి ఉపాస‌న స్పెష‌ల్ విషెస్
X

మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. చ‌ర‌ణ్ కు భార్య‌గా, కొణిదెల ఫ్యామిలీకి కోడ‌లిగా త‌న బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తూనే, అపోలో హాస్పిటల్ వైస్ చైర్మ‌న్ గా, సామాజిక కార్యక్ర‌మాల్లో సేవ‌లు అందిస్తూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను షేర్ చేస్తూ ఉంటుంది.


ఇదిలా ఉంటే ఇవాళ చిరంజీవి త‌ల్లి, రామ్ చ‌ర‌ణ్ నాన‌మ్మ అంజ‌నా దేవి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ ఫోటోను షేర్ చేసింది ఉపాస‌న. త‌మంద‌రినీ ఎంతగానో ప్రేమిస్తూ క్ర‌మ‌శిక్ష‌ణ ఉంచే నానమ్మ‌కు హ్యాపీ బ‌ర్త్ డే అని చెప్తూ ఆమెతో క‌లిసి జీవించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని ఉపాస‌న రాసుకొచ్చింది.

అంతేకాదు విషెస్ తెలుపుతూ ఉపాస‌న ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో యోగా క్లాస్ అయ్యాక‌ త‌మ మొఖాల్లోని మెరుపును చూడ‌మ‌ని చెప్పిన ఉపాస‌న‌, అంజ‌నా దేవి ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా యోగాకు హాజ‌ర‌వుతార‌ని, ఇది నిజంగా అంద‌రూ స్పూర్తిగా తీసుకోవాల్సిన విష‌యమ‌ని ఆ ఫోటో కింద వెల్లడించింది.

ఉపాస‌న పోస్ట్ కు మెగా ఫ్యాన్స్ లైకుల వ‌ర్షం కురిపిస్తూ అంజ‌నా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ‌తంలో కూడా ఉపాస‌న ఓసారి అంజ‌నా దేవి ఫోటో షేర్ చేస్తూ త‌మ కుటుంబానికి బ‌లం, ధైర్యం ఆమేన‌ని, ఆమె నుంచే ఓర్పు, స‌హ‌నం, క్ర‌మ‌శిక్ష‌ణ‌, కుటుంబ విలువ‌లు నేర్చుకున్నామ‌ని చెప్పింది.

అంజ‌నా దేవి కూడా రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటూ ఉంటుంది. ఇక రామ్ చ‌ర‌ణ్ విష‌యానికొస్తే రీసెంట్ గా గేమ్ ఛేంజ‌ర్ తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో ఆర్సీ16 సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ లో చ‌ర‌ణ్ జాయిన్ అయ్యాడు. షూటింగ్ ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి సినిమాను ద‌సరా లేదా దీపావ‌ళికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.