ఉపాసన 'వాలంటైన్స్ డే' పోస్ట్ వైరల్
నేడు వాలంటైన్స్ డే అనే విషయం తెల్సిందే. ఈ ప్రత్యేక రోజును సెలబ్రెటీలు పెద్దగా పట్టించుకోరు.
By: Tupaki Desk | 14 Feb 2025 8:49 AM GMTమెగా వారి ఇంటి కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యాపారవేత్తగా, తల్లిగా, భార్యగా ఎంతో బిజీగా ఉన్నా ఉపాసన రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్‌కి చేరువగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. రెగ్యులర్‌గా రామ్ చరణ్ గురించి, వారి కూతురు ఉపాసన గురించి సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌లు చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కూతురు క్లింకార ఫోటోలు షేర్ చేయలేదు. కానీ కూతురు గురించి ఎన్నో విషయాలను మాత్రం పంచుకుంటూ ఉంటుంది. ఇక రామ్ చరణ్ గొప్పతనం గురించి.. తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు పంచుకునే ఉపాసన తాజాగా చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
నేడు వాలంటైన్స్ డే అనే విషయం తెల్సిందే. ఈ ప్రత్యేక రోజును సెలబ్రెటీలు పెద్దగా పట్టించుకోరు. సినిమాలకు సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఇచ్చే వరకు ఓకే కానీ, ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం లేదంటే తమ వారి గురించి ప్రత్యేకంగా పోస్ట్‌లు చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఉపాస మాత్రం ఈ ప్రత్యేక రోజున ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఈమె ఏ పోస్ట్ చేసినా వైరల్ అవుతుంది. అయితే ఈసారి ఉపాసన చేసిన సరదా పోస్ట్ అంతకు మించి అన్నట్లుగా జనాలకు రీచ్ అయింది. ఉపాసన భలే సెన్సాఫ్ హ్యూమర్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంతకు ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఏం షేర్ చేశారు అంటే... వాలంటైన్స్ డే అనేది 22 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి సంబంధించినది. అమ్మాయిలు అంతకు మించి ఎక్కువ వయసు ఉన్న వారు ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడక పోవడం మంచిది. ఆ వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న వారు మీరు అయితే... ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం ఎదురు చూడండి అంటూ సున్నితంగా ఒక మంచి మెసేజ్‌ను, సరదాగా పోస్ట్ ద్వారా ఉపాసన తెలియజేశారు. ఆ వయసు వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉపాసన తన పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పారు.
ఉపాసన ఇలాంటి చమత్కారపు పోస్ట్‌లను చాలా అరుదుగా వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె నుంచి ఈ పోస్ట్ రావడం ఆశ్చర్యంగా ఉందని, తప్పకుండా ఆమె మాట విని 22 ఏళ్లు మించిన వారు వాలంటైన్స్ డే కోసం కాకుండా ఉమెన్స్ డే కోసం వెయిట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కి ఈ రోజు ఉపాసన ఏమైనా వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చి ఉంటుందా అని ఎదురు చూస్తున్న వారికి ఉపాసన పోస్ట్ కచ్చితంగా షాకింగ్ అనడంలో సందేహం లేదు.
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడం కోసం బుచ్చిబాబు, చరణ్ చాలా స్పీడ్‌గా మేకింగ్ పనులు జరుపుతున్నారు. మరో వైపు రెహమాన్ నుంచి రెండు మూడు పాటలను అప్పుడే బుచ్చిబాబు తీసుకున్నాడని తెలుస్తోంది. దసరా లేదా దీపావళికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అది సాధ్యం కాకుంటే డిసెంబర్‌లో అయినా సినిమా విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి.