Begin typing your search above and press return to search.

మెగా కోడ‌లితో బిజినెస్ ఛాన్స్..డోంట్ మిస్!

ఎవ‌రైతే హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాల‌నుకుంటున్నారో? అలాంటి మ‌హిళ‌లు కోసం నేను ఎదురు చూస్తున్నాను.

By:  Tupaki Desk   |   3 Sep 2024 8:04 AM GMT
మెగా కోడ‌లితో బిజినెస్ ఛాన్స్..డోంట్ మిస్!
X

ఉపాస‌న కొణిదెల ఫ్యామిలీ ఇంట ఓ గొప్ప కోడ‌లే కాదు. అంత‌కు మంచి గొప్ప వ్యాప‌ర‌వేత్త కూడా. అపోలో గ్రూప్ బాధ్య‌త‌లు మొత్తం ఆమె ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. మంచి బిజినెస్ ఎంట‌ర్ ప్రెన్యూన‌ర్ గానూ ఆమెకి పేరుంది. అత్త‌మ్మ సురేఖ‌ని సైతం అత్త‌మ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ లోకి దించారు. అత్త‌మ్మ లో టెస్టీ వంట‌కాల ట్యాలెంట్ చూసి? అత్త‌మ్మ‌ని ఎందుకు దించ‌కూడ‌ద‌ని ఆలోచించి దించారు.

ఇప్పుడా బిజినెస్ స‌క్సెస్ పుల్ గా న‌డుస్తోంది. ఇలా ఉపాస‌న తెలివితేట‌ల్ని స‌రిగ్గా వినియోగించుకోగ‌ల్గితే అద్భుతాలు సృష్టించొచ్చు. ఉపాస‌న ఆ ప్ర‌తిభ‌ను చూసే తాత‌య్య‌లు, తండ్రి కుమార్తెకి అపోలో బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఉపాసన యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఉపాసన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో ఓ ఈవెంట్లో పాల్గొనగా అక్కడే విష‌యాన్ని రివీల్ చేసారు.

ఎవ‌రైతే హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాల‌నుకుంటున్నారో? అలాంటి మ‌హిళ‌లు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను మీ కోపౌండ‌ర్ అవుతాను. మీ వ్యాపారంలో భాగ‌స్వామిని అవుతాను. మేము మీకు స‌హాయం చేస్తాం. ఇదంతా ఎందుకంటే భార‌త్ లో హెల్త్ కేర్ వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకొచ్చేందుకు అని తెలిపారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

మ‌హిళ‌లు ఎదిగేందుకు, అభివృద్ధి చెందేందుకు ఓ వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డానికి నాతో చేతులు క‌ల‌పండి. మీ వ్యాపారం యెక్కు ఉద్దేశం? అది ఎవ‌రిపై ప్ర‌భావం చూపుతుంది? మీ బిజినెస్ మన ప్లానెట్ కి ఎలాంటి పాజిటివిటీని ఇస్తుంది? నన్ను మీరు కో ఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారు? వంటి వివ‌రాలు వెబ్ సైట్ లో స‌బ్మిట్ చేయండి. వ్యాపార రంగంలో రాణించ‌ల‌నుకునే మ‌హిళ‌ల‌కు ఇది మంచి అవ‌కాశం. వినూత్న ఐడియాలో ఉపాస‌ని సంప్ర‌దిస్తే ఆమెకు న‌చ్చితే ప్రోత్స‌హించే అవ‌కాశం ఉంది క‌దా.