అయోధ్య- తిరుమలలో ఉపాసన ఉచిత ఎమర్జెన్సీ సేవలు
సనాతన ధర్మంపై ఉపాసన పోస్ట్ నెటిజనుల్లో వైరల్ గా మారింది. ఈ శనివారం నాడు ఎమర్జెన్సీ కేర్ సెంటర్లను ప్రారంభించినట్టు ఉపాసన వెల్లడించారు.
By: Tupaki Desk | 15 Dec 2024 8:52 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సామాజిక సేవా ధృక్పథం గురించి పరిచయం అవసరం లేదు. కరోనా క్రైసిస్ సమయంలో ఉపాసన కొణిదెల చాలా మందికి ఉచిత వైద్యం, ఉచిత మెడికల్ కిట్ ల అందజేత సహా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులు, ప్రజలకు కనెక్ట్ అయి ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలోని టూరిస్ట్ ఆధారిత ప్రాంతాలలో అపోలో ఎమర్జెన్సీ కేర్ సేవల్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి చోట్ల అపోలో ఎమర్జెన్సీ కేర్ ఉచిత సేవలను ప్రారంభించారు. ఇటీవలే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సమక్షంలో రామ్ జన్మభూమి అయోధ్యలో అపోలో ఎమర్జెన్సీ కేర్ ఉచిత సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అవసరమైన వారికి సానుభూతి, గౌరవంతో వైద్యం అందించడమే నిజమైన సనతన ధర్మమని తమ తాత గారైన అపోలో ప్రతాప్ రెడ్డి నేర్పించారని ఉపాసన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు. సనాతన ధర్మంపై ఉపాసన పోస్ట్ నెటిజనుల్లో వైరల్ గా మారింది. ఈ శనివారం నాడు ఎమర్జెన్సీ కేర్ సెంటర్లను ప్రారంభించినట్టు ఉపాసన వెల్లడించారు. ఉపాసన అపోలో లైఫ్, అపోలో హెల్త్ వింగ్ ద్వారా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 1100 కోట్ల నికర విలువ ఉన్న అపోలో వ్యాపార సామ్రాజ్యానికి ఉపాసన అధిపతి అన్న ప్రచారం ఉంది.