Begin typing your search above and press return to search.

నీకు సిట్టింగ్ అంటే ఏంటో తెలియ‌దా అన్నాడు!

బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తెర‌పైకి వ‌స్తూనే ఉంటుంది. లైంగిక వేధింపుల‌పై న‌టీమ‌ణులు మీడియా ముందు కొస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   3 Jan 2025 12:30 PM GMT
నీకు సిట్టింగ్ అంటే ఏంటో తెలియ‌దా అన్నాడు!
X

బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తెర‌పైకి వ‌స్తూనే ఉంటుంది. లైంగిక వేధింపుల‌పై న‌టీమ‌ణులు మీడియా ముందు కొస్తూనే ఉన్నారు. తాజాగా సీనియ‌ర్ న‌టి ఉపాస‌న సింగ్ `ది క‌పిల్ శ‌ర్మ` షోలో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో తాను ప‌డ్డ క‌ష్టాల గురించి చెప్పుకొచ్చారు. ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన కొత్త లో సౌత్ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ ద‌ర్శ‌కుడు కార‌ణంగా తాను ఇబ్బంది ప‌డిన‌ట్లు గుర్తు చేసుకున్నారు. `అప్ప‌ట్లో బాలీవుడ్ హీరో అనిల్ క‌పూర్ హీరోగా అత‌డు ఓ సినిమా తీయాల‌నుకున్నాడు.

అందులో న‌న్ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆప్రాజెక్ట్ ఒకే అయిన ద‌గ్గ‌ర నుంచి ఆ సినిమా మీటింగ్ కోసం వెంట అమ్మ‌ని, చెల్లిని తీసుకెళ్లే దాన్ని. దీంతో ఓ రోజు ఆ ద‌ర్శ‌కుడు వెంట వాళ్ల‌నెందుకు తీసు కొస్తున్నావ్ ? అని అడిగాడు ఓ రోజు రాత్రి 11.30 గంట‌ల‌కు ఫోన్ చేసి సిట్టింగ్ కోసం హోట‌ల్ కి ర‌మ్మ‌ని పిలిచాడు. కారు లేదు ఉదయం వ‌స్తాన‌ని చెప్పా. దానికాయ‌న నీకు సిట్టింగ్ అంటే ఏంటో తెలియదా? అని అడిగాడు.

దీంతో నేను షాక్ అయ్యాను. మ‌రుస‌టి రోజు ఆఫీస్ కు వెళ్లి అంద‌రి ముందు అత‌డిని తిట్టి పోసాను. కానీ ఆ సినిమా చేజార‌డంతో చాలా బాధ ప‌డ్డాను. వారం రోజులు బ‌య‌ట‌కు రాలేదు. ఎందుకంటే అప్ప‌టికే అనీల్ క‌పూర్ తో సినిమా చేస్తున్నాని అంద‌రికీ చెప్పాను. ఇప్పుడు వాళ్లు అడిగితే ఏం చెప్పాలో తెలియ‌లేదు. కానీ ఆ వారం రోజులు న‌న్ను మ‌రింత బ‌లంగా మార్చాయి.

అప్పుడే ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా? ఇండస్ట్రిని వ‌దిలి పెట్ట‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యా న‌న్నారు. `భాయ్ చాలీ స‌సారియా` తో 1988లో న‌టిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత ఎన్నో చిత్రాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం కూడా వ‌స్తోన్న అవ‌కాశాలు అంది పుచ్చుకుంటున్నారు. అయితే ఏడాదిన్న‌ర కాలంగా మాత్రం సినిమాలు చేయ‌లేదు. చాలా టీవీ సీరియ‌ల్స్ లోనూ ఉపాస‌నా సింగ్ న‌టించారు.