స్టార్ హీరో మాజీ భార్యకు ఉపాసన ఆల్ ది బెస్ట్!
అసలు విషయం ఏంటంటే హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సాన్ ఖాన్ చాలా కాలంగా ఇంటీరియర్, ఫర్నీచర్ బ్రాండ్ ది చార్‌కోల్ ను రన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 March 2025 12:28 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశ విదేశాల్లో ఉన్న వ్యాపార సామ్రాజ్యంను నడిపిస్తూ, ఇంట్లో చరణ్‌కి భార్యగా, క్లింకారకి తల్లిగా, కుటుంబ నిర్వాహణ ఇలా ఎన్నో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సాన్ ఖాన్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఉపాసనకి సుస్సాన్ ఖాన్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయా, ఉపాసనకు ఆమె కూడా స్నేహితురాలా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సాన్ ఖాన్ చాలా కాలంగా ఇంటీరియర్, ఫర్నీచర్ బ్రాండ్ ది చార్‌కోల్ ను రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ముంబైకే పరిమితం అయిన సుస్సాన్ ఖాన్ చార్ కోల్ ప్రాజెక్ట్ ఇక మీదట హైదరాబాద్‌లోనూ కార్యకళాపాళను నిర్వహించేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే అత్యంత ఖరీదైన ఏరియాలో ఆరు అంతస్తుల్లో భవనంను తీసుకోవడంతో పాటు వర్క్ మొదలు పెట్టారని సమాచారం అందుతోంది. హైదరాబాద్‌లో లగ్జరీ ఇంటీరియర్ వర్క్ కోసం, బ్రాండ్ ఫర్నీచర్ కోసం ది చార్ కోల్ సర్వీస్‌ను అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఆ విషయాన్ని ఉపాసన సైతం సోషల్ మీడియా ద్వారా తెలియసేసింది. సుస్సాన్ ఖాన్ యొక్క కొత్త ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఉపాసన పోస్ట్ చేశారు. ది చార్ కోల్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉపాసనకి ప్రత్యేకమైన గిఫ్ట్ ప్యాక్‌ను సుస్సాన్ ఖాన్ పంపించారు. ఆ ప్యాక్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఉపాసన అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హైదరాబాద్‌లో ప్రారంభించిన చార్ కోల్ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటూ ఆకాక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉపాసన పోస్ట్ పెట్టడంతో చాలా మందికి చార్ కోల్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. కనుక మంచి బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
సుస్సాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ది చార్‌కోల్ హైదరాబాద్ ప్రాజెక్ట్‌ను ఉపాసన ప్రమోట్ చేస్తున్నారు. ఉపాసన వంటి సెలబ్రెటీ ఒక్క పోస్ట్ పెట్టినా కచ్చితంగా చాలా పెద్ద రీచ్ ఉంటుంది. కనుక ఉపాసన పోస్ట్‌తో సుస్సాన్ ఖాన్ ది చార్ కోల్ హైదరాబాద్ ప్రాజెక్ట్ విజయవంతం అయినట్లే అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన తనకు నచ్చిన, తాను మెచ్చిన ప్రొడక్ట్స్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తారు అనే టాక్ ఉంది. కనుక ది చార్ కోల్ ప్రాజెక్ట్‌కి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. త్వరలోనే చరణ్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయడంతో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేయబోతున్నారు.