క్లీంకార అమ్మపోలిక నాన్న పోలిక? తెలిసేదెప్పుడు?
మెగా ఫ్యామిలీ ఇంట మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మెగా దంపతులు రామ్ చరణ్-ఉపాసన జీవితాల్లోకి బుల్లి పాపాయి క్లీంకార చేరింది.
By: Tupaki Desk | 15 May 2024 11:30 AM GMTమెగా ఫ్యామిలీ ఇంట మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మెగా దంపతులు రామ్ చరణ్-ఉపాసన జీవితాల్లోకి బుల్లి పాపాయి క్లీంకార చేరింది. కానీ క్లీంకార నాన్నపోలిక? అమ్మ పోలిక అన్నది మాత్రం ఇంతవరకూ క్లారిటీ రాలేదు. గత ఏడాది జూన్ 20న క్లీంకార జన్మించింది. 2024 జూన్ 20కి ఏడాది పూర్తవుతుంది. అంటే అందుకు ఎంతో సమయం లేదు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఆసంగతి పక్కనబెడితే క్లీంకార ఎవరు పోలిక అన్నది చెప్పడానికి ఆరేడు నెలలు చాలు. కానీ ఇంత వరకూ ఆ సంగతులేవి ఎక్కడా లీక్ అవ్వలేదు.
నిజానికి క్లీంకారని అభిమానులు సరిగ్గా చూపించను కూడా లేదు. అక్కడక్కడా మీడియాకి చిక్కిన ఫోటోలు తప్ప క్లీంకార ఎలా ఉంటుందన్నది చూపించలేదు. దీంతో పాపాయి ఎవరు పోలిక అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పుట్టిన రోజుకి ఇంకా కొన్నిరోజులే గడువు ఉంది. దీంతో పాప పోలిక పై ఫిలిం సర్కిల్స్ లో డిస్కషన్స్ మొదల య్యాయి. మెగా కుటుంబాలకు దగ్గరగా తిరిగే కొంత మంది చరణ్‌తో పోలుస్తుంటే మరికొంత మంది క్లీంకార అమ్మమ్మ పోలిక అని అంటున్నారు. అంటే అచ్చం ఉపాసనలాగే ఉంటుదేమో.
మరి ఈ ప్రచారానికి చరణ్-ఉపాసనలు ఎప్పుడు పుల్ స్టాప్ పెడతారో చూడాలి. అయితే ఉపాసన మాత్రం కొన్ని హింట్లు ఇచ్చారు. కుమార్తె తన తండ్రిని తలపిస్తుందని అన్నారు. క్లీంకారని చూస్తుంటే చరణ్ గుర్తొస్తాడు అన్నట్లు ఉపాసన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి క్లీంకార డాడ్ పొలికిలతోనే ఉంటుందని చెప్పొచ్చు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే. తొలి బర్త్ డే సందర్భంగా క్లీంకార గురించి అప్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఉపాసనతో తనలో వచ్చిన...వస్తోన్న మార్పుల గురించి ఇటీవల రివీల్ చేసిన సంగతి తెలిసిందే. మదర్స్ డే సందర్భంగా తల్లిగొప్పతనం గురించి చెప్పే ప్రయత్నం చేసారు. ప్రతీ మహిళకు తల్లి అవ్వడం అన్నది ఓ వరంగా చెప్పుకొచ్చారు. ఇక క్లీంకార విషయంలో చరణ్ ఎంతో శ్రద్దగా ఉంటారన్నారు. ప్రసవానంతరం తాను ఒత్తిడి జయించానంటే కారణంగా చరణ్ అని అన్నారు. ప్రస్తుతం చరణ్ `గేమ్ ఛేంజర్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.