ఎనిమిదేళ్ల క్రితం నాటి డ్రెస్ లో ఉపాసన సర్ ప్రైజ్!
మెగాకోడలు ఉపాసన సింప్లిసిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగాకోడలైనా..పెద్ద బిజినెస్ ఉమెన్ అయినా ఉపాసన ఎంతో డౌన్ టౌ ఎర్త్ ఉంటారు
By: Tupaki Desk | 14 Feb 2024 6:18 AM GMTమెగాకోడలు ఉపాసన సింప్లిసిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగాకోడలైనా..పెద్ద బిజినెస్ ఉమెన్ అయినా ఉపాసన ఎంతో డౌన్ టౌ ఎర్త్ ఉంటారు. ఆమె గురించి ఇన్ని విషయాలు రామ్ చరణ్ తో వివాహం తర్వాతే వెలుగులోకి వచ్చాయి. చరణ్ ఆమెతో ప్రేమలో పడటానికి కారణం కూడా ఉపాసనలో ఉన్న సిప్లిసిటీ కూడా కారణమని ఓ సందర్భంలో రివీల్ చేసారు. అలా ఇద్దరు మనసులు కలవడంతోనే జర్నీ ఎంతో సంతోషంగా సాగిపోతుంది.
అప్పటి నుంచి ఉపాసన ఎలాంటి యాక్టివిటీ చేసినా సోషల్ మీడియాలో మెగా బ్రాండ్ తో అంతే వైరల్ అవుతుంది. కాలక్రమంలో ఆమె ఎంతటి నిరాడంబరంగా ఉంటారు? అన్నది చాలా సందర్భాల్లో అర్దమైంది. జీవితం ఎలా ఉండాలి? లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి వంటి అంశాలపై ఉపాసన పలు సందర్భాల్లో తన వ్యక్తిగత అభిప్రాయాలు సైతం షేర్ చేసుకున్నారు. అవి నేటి తరం యువతిని ఎంతో స్పూర్తినింపేవే.
వేల కోట్లకు వారసురాలైనా ఉపాసనలో ఆ సింప్లిసిటీ ఆమెపై మరింత గౌరవాన్ని అభిమానుల్లో రెట్టింపు చేసిందనొచ్చు. తాజాగా ఆమె సింప్లిసిటీ మరోసారి డ్రెస్ రూపంలో బయట పడింది. ఎనిమిదేళ్ల క్రితం మా సినిమా అవార్డుల వేడుకలో కోసం ధరించిన ఎరుపు రంగు డిజైన్ చుడిదర్ నే దీపావళి సందర్భంగా ధరించి నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు సందర్భాలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డ్రెస్ ఎనిమిదేళ క్రితం పాతదైనా ఇంకా అదే రంగు డ్రెస్ ని ఉపాసన వేసుకుంటున్నారంటే? ఆమె ఎంత పొందుకైన మహిళ అని చెప్పాలి? ఆమెలో నిరాండంబరతను మాటల్లో వర్ణించడం సాధ్యమేనా? అనిపిస్తుంది. అంతటి గొప్ప క్రమశిక్షణతో మెలుగుతున్నారు కాబట్టే గొప్ప వ్యాపారవేత్త కూడా అయ్యారు. చరణ్ మెచ్చిన భార్యమణి అయ్యారు. అలాగే నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ఆసక్తికర పోస్ట్..ఫోటో షేర్ చేసారు. చెర్రి..క్లీంకార చేతుల్ని పట్టుకున్న ఫోటోల్ని ఎక్స్ ద్వారా పంచు కున్నారు. ఎప్పటికీ ఈ బంధం ఇలాగే ఉంటుందని అర్దం వచ్చేలా కొన్ని ఎమోజీలు పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ముగ్గుర్నీ అలా చూసుకుని అభిమానులు సంతోష పడుతున్నారు.