Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ తో వివాహం ఉపాస‌న ఇలా ఫీల‌వుతుందా?

తాజాగా చ‌ర‌ణ్ -ఉపాస‌న ఒకరిపై ఒక‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించుకున్నారు. మార్చి 8న మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఉపాస‌న ఆస‌క్తిర విష‌యాలు పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   7 March 2024 9:37 AM GMT
చ‌ర‌ణ్ తో వివాహం ఉపాస‌న ఇలా ఫీల‌వుతుందా?
X

రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌నల జోడీ టాలీవుడ్ ఆద‌ర్శ‌దంప‌తులుగా ప్ర‌యాణం సాగిస్తున్నారు. ఎక్క‌డికి వెళ్ల ల‌న్నా ఇద్ద‌రు చిలాకా-గోరంక‌ల్లా ఎగిరిపోతారు. ఇటీవ‌లే అంబానీ ఇంట పెళ్లి వేడుక కోసం వెళ్ల‌డం . .జ‌ర్నీలో చ‌ర‌ణ్‌-ఉపాస‌న కాళ్లు ప‌ట్టిన‌ వీడియో ఎంత‌లా వైర‌ల్ అయిందో తెలిసిందే. ఈ వీడియో ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌ని మ‌రోసారి చాటింది. భార్య‌భ‌ర్త‌లుగా ఇద్ద‌రు ఎంత సంతోషంగా ఉన్నారు? వాళ్లిద్ద‌రి మ‌ధ్య అండ‌ర్ స్టాండింగ్ ఎంత బ‌లంగా ఉంది? అన్న‌ది అంద‌రికీ అర్ద‌మైంది.

తాజాగా చ‌ర‌ణ్ -ఉపాస‌న ఒకరిపై ఒక‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించుకున్నారు. మార్చి 8న మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఉపాస‌న ఆస‌క్తిర విష‌యాలు పంచుకున్నారు. చ‌ర‌ణ్ తో ప్ర‌యాణం మొద‌లైన త‌ర్వాత ఎదురైన అనుభ‌వాలు ఎలా ఉన్నాయో ఆమె మాటల్లోనే.. 'చ‌ర‌ణ్ ది నాది భిన్న‌మైన కుటుంబ నేప‌థ్యాలు. చ‌ర‌ణ్ తో వివాహం కాగానే వేరే ప్ర‌పంచంలోకి వెళ్లిన‌ట్లు అయింది. ఇప్పుడు అత‌డికి నీడ‌లా ఉంటున్నంద‌కు ఎంతో గ‌ర్వంగా ఉంది. ఇద్ద‌రం ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటూ ముందుకు సాగుతు న్నాం.

బిడ్డ‌ను క‌నాలి అన్న నిర్ణ‌యంతో క్లీంకార పుట్టింది. మా అమ్మ వాళ్ల‌ను తాత‌య్య ఆత్మ విశ్వాసంతో పెంచారు. వాళ్లు కూడా ఆయ‌న క‌ల‌ల‌కు అనుగునంగా జీవించారు. మా కుటుంబంలో మ‌హిళ‌లు నా జీవితంలోనే కీల‌క పాత్ర పోషించారు. నేను స్త్రీ ప్ర‌పంచం అని భావించే వాతావ‌ర‌ణంలో పుట్టాను' అని అన్నారు. అలాగే చ‌ర‌ణ్ కూడా ఉపాస‌న గురించి పొగిడేసారు.' నా భార్య కావ‌డం వ‌ల్ల ఉపాస‌న‌కి గుర్తింపు రాలేదు. ఆమె చేసిన ఎన్నో మంచి కార్య‌క్ర‌మాల‌తోనే అది సాధ్య‌మైంది.

ప‌లు రంగాల్లో త‌న దైన ముద్ర వేసింది. కుటుంబ విలువ‌ల్ని గౌర‌విస్తుంది. వార‌స‌త్వాన్ని అందంగా ముందుకు తీసుకెళ్తుంది' అని అన్నారు. ఉపాస‌న బిజినెస్ ఉమెన్ గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అపోలో వ్య‌వ‌హ‌రాలు చూసుకుంటూనే చర‌ణ్ కి భార్య‌గా అన్ని ర‌కాల బాధ్య‌త‌లు నెర వేరు స్తున్నారు. క్లీంకార జ‌న్మించినా ఉపాస‌న వేగం మాత్రం త‌గ్గ‌లేదు. మ‌రింత‌గా రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నారు.