Begin typing your search above and press return to search.

ఇంకా అనాగరిక ప్ర‌పంచ‌మేనా?- ఉపాస‌న‌

ఇంకా అనాగ‌రిక ప్ర‌పంచంలోనే ఉన్నాం! అంటూ ఉపాస‌న ఆవేద‌న చెందారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 4:41 AM GMT
ఇంకా అనాగరిక ప్ర‌పంచ‌మేనా?- ఉపాస‌న‌
X

దేశ‌వ్యాప్తంగా నేడు స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఆగ‌స్టు 15 ప్ర‌త్యేక దినాన ఎంద‌రో ప్ర‌ముఖులు స్వాతంత్య్ర పోరాటంలో అమ‌రవీరుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటున్నారు. జెండావందనం కార్య‌క్ర‌మంలో జాతీయ ప‌తాకానికి సెల్యూట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హెల్త్ ఎమ్‌.డి అయిన ఉపాస‌న కొణిదెల సోష‌ల్ మీడియాల్లో చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

మ‌నం ఎలాంటి స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా అనాగ‌రిక ప్ర‌పంచంలోనే ఉన్నాం! అంటూ ఉపాస‌న ఆవేద‌న చెందారు. అయితే దీనికి కార‌ణం ఇటీవ‌ల కోల్ క‌తాలో వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న త‌న‌ను ఎంత‌గా క‌ల‌చి వేసిందో ప్ర‌స్థావిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న అది. స‌మాజంలో అనాగ‌రిక‌త ఇంకా కొన‌సాగుతుంటే మ‌నం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జ‌రుపుకుంటున్నాం? అని ఉపాస‌న ప్ర‌శ్నించారు.

దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణకు మ‌హిళ‌లే వెన్నెముక‌. ఎక్కువ‌మంది స్త్రీల‌ను వ‌ర్క్ ఫోర్స్ లోకి తీసుకురావాల‌నే ల‌క్ష్యం మ‌రింత బ‌ల‌ప‌డింది. స్త్రీల‌కు భ‌ద్ర‌త‌, గౌర‌వం ద‌క్కేందుకు కృషి చేద్దాం! అని పిలుపునిచ్చారు. అపోలో సంస్థానంలో నేడు వేలాది మంది స్త్రీలు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను అందుకుంటున్నారు. దీనికి ఉపాస‌న వంటి వారి కృషి అభినంద‌నీయం.

ఉపాస‌న స్వ‌గ‌తం:

ఉపాసన కొణిదెల‌.. అపోలో సంస్థానాధీశురాలు. నేటిత‌రంలో ఎంట‌ర్ ప్రెన్యూర్ గా క‌ష్ఠ‌త‌ర బాధ్య‌త‌ల్ని నెర‌వేరుస్తున్న ప్ర‌తిభావ‌ని. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్.. అపోలో యువ‌ర్‌లైఫ్ వైస్-ఛైర్ పర్సన్ .. అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ .. ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్-టిపిఎ లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా బృహ‌త్త‌ర బాధ్య‌త‌ల్ని ఉపాస‌న‌ నెర‌వేరుస్తున్నారు. ఆరోగ్యం - ఫిట్ నెస్ కు సంబంధించిన సమాచారాన్ని అందించే హెల్త్ కేర్ - వెల్ నెస్ వెబ్ సైట్ బి పాజిటివ్ కి యజమాని.. ఎడిటర్-ఇన్-చీఫ్.

ఉపాసన కామినేని కొణిదెల జంతు సంరక్షకురాలు.. అపోలో హాస్పిటల్స్ కుటుంబానికి చెందిన విశిష్ట-పరోపకారి. సమాజానికి తిరిగి ఇవ్వాల‌ని న‌మ్మే అర్థవంతమైన ప్రభావాన్ని చూపించే వ్యాపారాలను సృష్టించిన గొప్ప వ్య‌క్తి. ప్రత్యామ్నాయ ఔషధం.. వైద్యం లో జ్ఞానాన్ని అన్వేషించడం ద్వారా ప్రపంచం హీల్ ఇండియాను పాపుల‌ర్ చేసిన మేటి ప్ర‌తిభావ‌ని. ఉపాస‌న‌- రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కు క్లీన్ కారా అనే కుమార్తె ఉన్న సంగ‌తి తెలిసిందే.