తల్లి కావడానికి అందుకే సమయం తీసుకున్నా!
అయితే క్లీంకార వాళ్ల జీవితాల్లోకి రాకముందు కొన్ని రకాల విమర్శలు సైతం ఎదుర్కున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Feb 2024 11:52 AM GMTటాలీవుడ్ ఆదర్శ దంపతులుగా వెలిగిపోతున్న రామ్ చరణ్-ఉపాసనల బంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాన్ని..జర్నీని సంతోషంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కొత్తగా ఆ దంపతుల మధ్యలోకి క్లీంకార రావడంతో ఆ జోడీ మరింత సంతోషంతో కనిపిస్తోంది. అయితే క్లీంకార వాళ్ల జీవితాల్లోకి రాకముందు కొన్ని రకాల విమర్శలు సైతం ఎదుర్కున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా ఉపాసనపై వ్యక్తిగత కామెంట్లు అప్పట్లో తెరపైకి వచ్చాయి. చరణ్-ఉపాసనలు పిల్లల్ని అప్పుడే వద్దనుకుంటున్నారా? కెరీర్ పరంగా ఎదుగుదల కోసం కఠిన నిర్ణయాలతో వెళ్తున్నారా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే వాటినై ఏనాడు ఉపాసన ఎక్కడా స్పందించలేదు. ఎన్ని రకాల కథనాలొచ్చినా మౌనంగానే ఉన్నారు. అయితే తాజాగా వాటన్నింటిపై ఉపాసన స్పందించారు.
అమ్మ కావడాన్ని అందరూ గ్రేట్ అనుకుంటారని.. తాను మాత్రం డబుల్ గ్రేట్ అనుకుంటానని ఆమె తెలిపారు. తమకు పిల్లలు పుట్టడం ఆలస్యం కావడంతో... ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే కామెంట్లు తన వరకు కూడా వచ్చాయని చెప్పారు. పిల్లల్ని కనడానికి పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాతే కనాలని తాను- రామ్ చరణ్ అనుకున్నామని.. అందుకే తల్లిదండ్రులు కావడానికి సమయం తీసుకున్నామని వెల్లడించారు.
వ్యక్తిగతంగా తాను చరణ్ ఎంతో సన్నిహితంగా ఉంటామని..కానీ వృత్తి పరమైన విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోబోమని ఉపాసన తెలిపారు. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు ఎప్పుడూ గౌరవించుకుంటామని...ఇలా ఉండాలని చరణ్ ఏనాడు అనలేదు..నేను అలాంటి కండీషన్లు నా నుంచి కూడా లేవు. ఎవరికి నచ్చినట్లు గా వారు స్వేచ్ఛగా ఉంటామని తెలిపారు.