Begin typing your search above and press return to search.

చరణ్‌ కూతురు కోసం 'కల్కి' స్పెషల్‌...!

ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్‌ గా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   3 Jun 2024 10:19 AM GMT
చరణ్‌ కూతురు కోసం కల్కి స్పెషల్‌...!
X

ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్‌ గా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సైన్స్ ఫిక్షన్స్‌ టైమ్‌ ట్రావెల్‌ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలు స్పీడ్‌ అందుకున్నాయి.


ఇప్పటికే ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించారు. మరో వైపు సినిమాకు సంబంధించిన బొమ్మలు మరియు టీ షర్ట్స్ ను మార్కెట్‌ లోకి తీసుకు రావడం ద్వారా ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా మంచి బిజినెస్ కూడా అవుతుందని మార్కెట్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

తాజాగా కల్కి స్పెషల్‌ బొమ్మలు మరియు పోస్టర్స్ ను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతుల కూతురు క్లీంకార కి అందించడం జరిగింది. క్లీంకార 'కల్కి' స్పెషల్‌ టాయిస్ మరియు పోస్టర్స్ తో ఆడుకుంటూ ఉన్న ఫోటోను ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

ఆల్‌ ది బెస్ట్‌ కల్కి టీమ్‌ అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఉపాసన కామెంట్‌ చేశారు. రామ్‌ చరణ్‌ మరియు ప్రభాస్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా కల్కి నిర్మాణ సంస్థతో మెగా ఫ్యామిలీకి సుదీర్ఘ కాలంగా మంచి రిలేషన్‌ ఉంది. అందుకే కల్కి ప్రమోషన్స్‌ లో క్లీంకార భాగం అయ్యిందని కొందరు మాట్లాడుతున్నారు.

క్లీంకార సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్న మేకర్స్‌ ఇలా బుజ్జి బొమ్మలను మార్కెట్‌ లోకి వదలడం అనేది కొత్త కాన్సెప్ట్‌ అని, తప్పకుండా మరింత మందికి కల్కి సినిమా చేరుతుంది అనే అభిప్రాయంను నెటిజన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.