సెప్టెంబర్ సెకండ్ వీక్.. మొత్తం చిన్న చిత్రాలదే!
వాటి ఈసారి అన్నీ చిన్న చిత్రాలే ఉండటం గమనార్హం. ఆ పూర్తి వివరాలు..
By: Tupaki Desk | 11 Sep 2024 2:35 PM GMTప్రతి శుక్రవారం.. భాషతో సంబంధం లేకుండా థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. కొన్ని ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ దక్కించుకుంటే.. మరికొన్ని మెల్లగా హిట్ టాక్ అందుకుంటాయి. ఇంకొన్ని ప్రేక్షకులను నిరాశ పరుస్తాయి. ఇది ఎప్పుడూ జరిగిన సంగతే. అయితే సెప్టెంబర్ రెండో వారంలో పలు సినిమా విడుదలవుతున్నాయి. వాటి ఈసారి అన్నీ చిన్న చిత్రాలే ఉండటం గమనార్హం. ఆ పూర్తి వివరాలు..
ముందుగా.. తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్.. ఎ.ఆర్.ఎం మూవీ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్ లో కొత్త దర్శకుడు జితిన్ లాల్ తెరకెక్కించిన ఆ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయనుంది. ఎ.ఆర్.ఎంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ సహా పలువురు యాక్ట్ చేశారు. సినిమా కోసం టోవినో కళవి విద్యలో ట్రైనింగ్ తీసుకున్నారట.
ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ హిట్ మత్తు వదలరా సీక్వెల్.. ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రెండో కొడుకు శ్రీసింహ, సత్య లీడ్ రోల్స్ లో తెరకెక్కిన మత్తు వదలరా-2.. సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ కానుంది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ కమ్ ప్రమోషనల్ కంటెంట్.. అంచనాలను మరిన్ని పెంచాయి.
అదే రోజు.. యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త భలే ఉన్నాడే కూడా రిలీజ్ కానుంది. శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటించింది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్స్ తో కూడిన స్టోరీతో రూపొందిన ఆ చిత్రాన్ని కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. కొద్ది రోజులుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజ్ తరుణ్.. భలే ఉన్నాడో మూవీతో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
అయితే సెప్టెంబర్ 13వ తేదీన మరో రెండు సినిమాలు కూడా రానున్నాయి. రెజీనా, దిలీప్ ప్రకాష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఉత్సవం మూవీ విడుదల కానుంది. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఉత్సవంలో అనేక మంది టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ భాగమయ్యారు. యంగ్ హీరో ధృవ వాయు విభిన్నమైన కథతో రూపొందిన కళింగ సినిమాతో వస్తున్నారు. మరి ఈ చిన్న చిత్రాల్లో ఏది ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.