యష్ రాజ్ స్పై థ్రిల్లర్స్.. లైనప్ గట్టిగానే..
ఈ స్పై యూనివర్స్ లో భాగంగా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తో ‘వార్’ చిత్రాన్ని 2019లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
By: Tupaki Desk | 10 Oct 2024 8:30 PM GMTబాలీవుడ్ అతి పెద్ద ఫ్రాంచైజ్ లలో ఒకటిగా యష్ రాజ్ స్పై యూనివర్స్ ఉంది. సల్మాన్ ఖాన్ ‘ఏక్ ది టైగర్’ సినిమాతో 2012 స్పై యూనివర్స్ స్టార్ట్ అయ్యింది. అందులో సెకండ్ మూవీగా ‘టైగర్ జిందా హై’ 2017లో రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ స్పై యూనివర్స్ లో భాగంగా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తో ‘వార్’ చిత్రాన్ని 2019లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.
దీని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రాన్ని 2013లో యష్ రాజ్ ఫిలిమ్స్ రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ‘పఠాన్’ తో యష్ రాజ్ స్పై యూనివర్స్ కి మరింత ఊపోచ్చింది. ఈ మూవీ తర్వాత సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలాగే యష్ రాజ్ స్పై యూనివర్స్ లైన్ అప్ కి కొంత బ్రేక్ పడుతుందని అందరూ భావించారు.
అయితే ఆదిత్య చోప్రా మాత్రం తగ్గేది లే అన్నట్లుగా ‘వార్ 2’, ‘టైగర్ వెర్సస్ పఠాన్2. అలియా భట్ తో ‘ఆల్ఫా’ సినిమాలు లైన్ అప్ లో పెట్టారు. ప్రస్తుతం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘వార్ 2’ మూవీ తెరకెక్కుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అవుతోంది. మరో వైపు అలియా భట్, బాబీ డియోల్, శర్వారి, అనిల్ కపూర్ లాంటి స్టార్ యాక్టర్స్ తో లేడీ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’ తెరకెక్కిస్తున్నారు.
అయితే యష్ రాజ్ బ్యానర్ నుంచి నెక్స్ట్ రాబోయే స్పై థ్రిల్లర్ సినిమాలకి ఊపు రావాలంటే మాత్రం కచ్చితంగా హృతిక్, ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతోన్న ‘వార్ 2’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలి. అప్పుడు మరల స్పై యూనివర్స్ లో మూవీస్ పై అంచనాలు పెరుగుతాయి. అలా కాకుండా ‘పఠాన్ ’ లాంటి రిజల్ట్ ‘వార్ 2’ కి కూడా వస్తే కచ్చితంగా స్పై యూనివర్స్ సినిమాలకి కొంతకాలం బ్రేక్స్ పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
‘వార్ 2’ మూవీ సక్సెస్ అయితే నెక్స్ట్ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ తో సోలోగా ఒక స్పై థ్రిల్లర్ మూవీని తెరకెక్కించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇండియాలోనే అతి పెద్ద సినిమాటిక్ ఫ్రాంచైజ్ గా యష్ రాజ్ స్పై యూనివర్స్ ఉంది. ఇది ఏ మేరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందనేది వేచి చూడాలి.