ఐదు నెలల బాక్సాఫీస్ జాతర.. వచ్చేవన్నీ క్రేజీ సినిమాలే..
ఈ నెల ఆఖరున రిలీజ్ కాబోయే సరిపోదా శనివారం మూవీపైన పాజిటివ్ బజ్ ఉంది.
By: Tupaki Desk | 25 Aug 2024 11:30 AM GMT2024 ప్రథమార్ధం పూర్తయిపోయింది. ఈ టైమ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టిగా 10 సక్సెస్ లు కూడా రాలేదు. అయితే కొన్ని సినిమాలు అనూహ్యంగా పాజిటివ్ వైబ్ సొంతం చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఆగష్టులో రిలీజ్ అయిన సినిమాలలో కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ నెల ఆఖరున రిలీజ్ కాబోయే సరిపోదా శనివారం మూవీపైన పాజిటివ్ బజ్ ఉంది.
ఇక సెప్టెంబర్ నెల మొదటి వారంలో దళపతి విజయ్ GOAT మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. తరువాత చివరి వారం వరకు మేగ్జిమమ్ చిన్న సినిమాలే లైన్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా దేవర మూవీ ఉంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఎన్టీఆర్ ఇమేజ్, యాక్షన్ కంటెంట్ మూవీని సక్సెస్ దిశగా తీసుకొని వెళ్తుందని భావిస్తున్నారు. ఆచార్య అనంతరం చేస్తున్న సినిమా కాబట్టి కొరటాల స్ట్రాంగ్ ఎలివేషన్స్ తో సినిమా చేస్తాడని ఆడియెన్స్ నమ్ముతున్నారు. అక్టోబర్ 10న రజినీకాంత్ వేట్టయాన్ థియేటర్స్ లోకి వస్తోంది. అలాగే పాన్ వరల్డ్ మూవీ కంగువా కూడా భారీ అంచనాల మధ్యలో అదే రోజు రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 31న విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ క్రేజీ మూవీగానే థియేటర్స్ లోకి రానుంది.
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. కార్తీ వావాతియార్ మూవీ కూడా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరల నవంబర్ 9న సిద్దు జొన్నలగడ్డ తెలుసుకదా రిలీజ్ కి రెడీ అవుతోంది. డిసెంబర్ 6న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. డిసెంబర్ 20న నాగ చైతన్య, చందూ మొండేటి మూవీ పాన్ ఇండియా మూవీ తండేల్ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది.
అలాగే డిసెంబర్ లోనే క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవ్వబోతోంది. ఓవరాల్ గా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప ది రూల్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాల కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ మూవీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ముగ్గురు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ గా ఎస్టాబ్లిష్ కావడంతో ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.