Begin typing your search above and press return to search.

రాబోయే టాప్ 10 మూవీస్.. ఎన్టీఆర్, బన్నీ డామినేషన్!

ప్రస్తుతం ఈ రెండు లిస్టులు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   23 July 2024 11:39 AM GMT
రాబోయే టాప్ 10 మూవీస్.. ఎన్టీఆర్, బన్నీ డామినేషన్!
X

ప్రతి ఏడాది లాగే.. ఈసారి కూడా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) పాపులర్ ఇండియన్ సినిమాస్, మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలను రీసెంట్ గా రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీకి ఉన్న మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా జాబితాలను రూపొందించింది. ప్రస్తుతం ఈ రెండు లిస్టులు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

అయితే 2024 సెకండాఫ్ లో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ ను ఐఎండీబీ విడుదల చేయడం గమనార్హం. ఆ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక పుష్ప-2 టాప్ లో ఉండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్న దేవర మూవీ సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవరపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే సెకెండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి టాప్ 10లో ఉన్న మిగతా సినిమాలు ఏంటంటే?

1. పుష్ప: ది రూల్

2. దేవర- పార్ట్ 1

3. వెల్ కమ్ టు ది జంగిల్

4. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)

5. కంగువ

6. సింగం ఎగైన్

7. భూల్ భులయ్యా 3

8. తంగలాన్

9. ఔరో మే కహా దమ్ థా

10. స్త్రీ 2

అక్షయ్ కుమార్, దిశా పటానీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న వెల్‌కమ్ టు ది జంగిల్‌ మూవీ 2024 డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానుంది. విజయ్ దళపతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. సూర్య కంగువ అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. సింగం ఎగైన్ చిత్రం నవంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భూల్ భులయ్యా 3 దీపావళి కానుకగా అక్టోబర్ 31న, విక్రమ్ తంగలాన్ ఆగస్టు 15న, ఆరోన్ మే కహన్ దమ్ థా ఆగస్టు 2న, స్త్రీ 2 ఆగస్టు 15న రిలీజ్ కానున్నాయి. మరి ఈ ఐఎండీబీ రిలీజ్ చేసిన టాప్ 10 మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఎలాంటి హిట్ అవుతాయో చూడాలి.