Begin typing your search above and press return to search.

RAPO22: ప్రేమతో.. క్యూట్ జోడి!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని సరైన హిట్ కోసం కొంత కాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Dec 2024 7:13 AM GMT
RAPO22: ప్రేమతో.. క్యూట్ జోడి!
X

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని సరైన హిట్ కోసం కొంత కాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు పెట్టుకున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ డిజాస్టర్ గా మారడంతో ఇప్పుడు సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ మహేష్ బాబుకు ఛాన్స్ ఇచ్చారు.

రారా కృష్ణయ్య, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో ఆడియన్స్ ను మెప్పించిన మహేష్ బాబు.పితో రామ్ ఓ సినిమా చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కు పరిచయమైన భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా.. ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నేని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రాపో 22 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. దర్శకులు హను రాఘవపూడి, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణతోపాటు పలువురు సినీ ప్రముఖులు గెస్టులు విచ్చేసి.. మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌ కు హను రాఘవపూడి క్లాప్‌ కొట్టారు. అందుకు సంబంధించిన పిక్స్ అప్పుడు వైరల్ అయ్యాయి.

పూజా కార్యక్రమాల తర్వాత సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఆ మధ్య మీకు సుపరిచితుడు మీలో ఒకడు మీ సాగర్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన రామ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో రామ్, భాగ్యశ్రీ వర్షంలో తడుస్తూ కనిపించారు. ఇద్దరూ వెనక్కి తిరిగి ఉన్నా.. ఆసక్తి రేపుతున్నారు.

మొత్తం బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో పోస్టర్ ఉండగా.. సినీ ప్రియులను తెగ మెప్పిస్తోంది. ప్రేమతో ఈ కొత్త సంవత్సరం అంటూ ఇంట్రెస్టింగ్ రైటప్ ఇచ్చిన మేకర్స్.. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీ 10.35 నిమిషాలకు మరో అప్డేట్ ఇస్తామని తెలిపారు. దీంతో టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈగర్లీ వెయిటింగ్ అంటూ సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అయితే యూత్‌ తో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో మూవీ రూపొందిస్తున్నామని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. హై ఎనర్జీతో న్యూ ఏజ్‌ స్టోరీగా తీర్చిదిద్దినట్లు టాక్ వినిపిస్తోంది. రామ్‌ విభిన్నమైన లుక్‌ లో కనిపిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మరి చూడాలి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో..