Begin typing your search above and press return to search.

మ‌హేష్ అభిమానులు జ‌క్క‌న్న షాకింగ్ స‌ర్ ప్రైజ్!

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆర్ ఎఫ్ సీలో మొద‌లైంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 6:25 AM GMT
మ‌హేష్ అభిమానులు జ‌క్క‌న్న షాకింగ్ స‌ర్ ప్రైజ్!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి త‌దుప‌రి పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ద మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆప్రిక‌న్ అడ‌వుల బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. మ‌హేష్ జ‌పాన్ లో ప్ర‌త్యేకంగా సినిమాకి అవ‌స‌ర‌మైన‌ ట్రైనింగ్ కూడా ముగించాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక రెగ్యుల‌ర్ షూట్ మొద‌ల‌వ్వ‌డ‌మే ఆల‌స్యం. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆర్ ఎఫ్ సీలో మొద‌లైంది. కానీ ఇది రెగ్యుల‌ర్ షూట్ కాదు.

డ‌మ్మీ షూట్. రిహార్స‌ల్స్ నే ప‌థ్యంలో కొంత మంది న‌టుల‌పై ఇలా డ‌మ్మీ షూట్ చేస్తున్నారు. ఆఫ్రిక‌న్ బ్యాక్ డ్రాప్ డ‌మ్మీ సెట్లు నిర్మించి వాటిలో షూట్ చేసి జ‌క్క‌న్న అన్నీచెక్ చేసుకుంటున్నాడు. చిన్న సెటప్‌లో సెట్స్, గుర్రాలను, అవ‌స‌ర‌మైన న‌టుల్ని తీసుకొచ్చి ఇలా రిహార్స‌ల్స్ చేస్తున్నార‌ని స‌మాచారం. త‌ప్పొ ప్పుల‌ను ఇప్పుడే స‌రి చేసుకుని రెగ్యుల‌ర్ షూట్ కి ఎలాంటి అవాంత‌రం ఏర్ప‌డ కుండా ముందు జాగ్ర‌త్త‌గా జ‌క్క‌న్న ఇలాప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంలో రాజ‌మౌళి ప్లానింగ్ ఎంతో ప‌క్కాగా ఉంటుంది.

షూట్ మొద‌లైన త‌ర్వాత ఎలాంటి డిస్ట‌బెన్స్ లేకుండా ప‌నిచేయ‌డం ఆయ‌న స్టైల్. అందుకే ఆయ‌న ముందుగానే న‌టీనటులంద‌ర్నీఒకే తాటిపైకి తీసుకొచ్చి వ‌ర్క్ షాప్ లు నిర్వ‌హిస్తుంటారు. త‌ప్పొప్పుల‌ను అక్క‌డే స‌రి చేసుకుంటారు. `బాహుబ‌లి` ద‌గ్గ‌ర నుంచి రాజ‌మౌళి ఇదే విధానంలో సినిమాలు చేస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` కూడా రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభానికి....ముందు షూట్ మ‌ధ్య‌లో కూడా వ‌ర్క్ షాప్ లు నిర్వ‌హించారు.

సాధార‌ణంగా వ‌ర్క్ షాపులు నిర్వ‌హించ‌డం అన్న‌ది బాలీవుడ్ డైరెక్ట‌ర్లు ఫాలో అవుతుంటారు. భారీ కాన్వాస్ పై తెర‌కెక్కించే ఏ సినిమా అయినా అక్క‌డ ద‌ర్శ‌కులు ముందే వర్క్ షాపులు నిర్వ‌హిస్తారు. అవ‌స‌రం మేర డ‌బ్బీ షూట్ కూడా చేస్తారు. అంతా ప‌క్కా అనుకున్న త‌ర్వాతే షూటింగ్ మొద‌లు పెడ‌తారు. వాళ్ల త‌రహాలోనే రాజ‌మౌళి కూడా వెళ్తున్నారు.