ఉపేంద్ర జీవిత కల నెరవేరిన వేళ!
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న `కూలీ` చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అవకాశం పట్ల ఉపేంద్ర ఓపెన్ అయ్యారు.
By: Tupaki Desk | 15 Dec 2024 10:30 AM GMTబాలీవుడ్ లో అమితాబచ్చన్...కోలీవుడ్ లో రజనీకాంత్, కమల్ హాసన్, టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండరీ నటీనటులతో తెరను పంచుకోవడం కోసం ఎంతో మంది నటీనటులు ఎదురు చూస్తుంటారు. నట ప్రస్తానం మొదలు పెట్టిన నాటి నుంచి ముగించే వరకూ ఏదో ఒక దశలో వాళ్లతో నటించే అవకాశం రాకపోదా? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్లలో నేను ఒకడినంటూ కన్నడ స్టార్ ఉపేంద్ర ముందుకొచ్చారు.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న `కూలీ` చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అవకాశం పట్ల ఉపేంద్ర ఓపెన్ అయ్యారు. `రజనీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయనతో సినిమా అవకాశం రావడంతో నా జీవిత కల నెరవేరిన అనుభూతి కలిగింది. అలాంటి లెజెండ్స్ తో నటించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా ఫీలవుతున్నాను. నేను ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాను.
అన్ని పరిశ్రమకు వచ్చాకే నేర్చుకున్నాను. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాను. విజయాలు, అపజయాలు చూసాను. జీవితంలో ప్రతీ దశ ఎంతో ముఖ్యమైనదే. అన్ని ఉంటేనే జీవితం. సంతోషం ఒక్కటే జీవితం అంటే నమ్మను. ఇప్పుడు రజనీకాంత్ గారితో నటిస్తుంటే నా కల నెరవేరినట్లు అనిపిస్తుంది. గొప్ప అనుభూతికి లోనవుతున్నాను. సినిమాలో ఇంకా చాలా మంది స్టార్లు భాగమయ్యారు.
వాళ్లందరితో గొప్ప ఎక్స్ పీరియన్స్ చూసాను` అని అన్నారు. త్వరలో ఉపేంద్ర `యూ ఐ` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో యూఐ విజయంపై ధీమా వ్యక్తం చేసారు. `ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చి రెండవ భాగం చేయమని కోరితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా. సాధారణంగా నాకు రెండు భాగాలు నచ్చదు. ఏ సినిమా చేసిన కొత్త కంటెంట్ తో రావాలి అన్నది నా ఉద్దేశం` అని అన్నారు.