ఉపేంద్ర యూఐ.. అమీర్ ఖాన్ ఇలా..
ఆయన రోల్ విలక్షణంగా ఉంటుందని అంచనా వేస్తారు.
By: Tupaki Desk | 12 Dec 2024 8:08 AM GMTకన్నడ యాక్టర్ ఉపేంద్రకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన కాంపౌండ్ నుండి సినిమా వస్తుందంటే చాలు.. వినూత్న కథాంశంతో ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోతారు. ఆయన రోల్ విలక్షణంగా ఉంటుందని అంచనా వేస్తారు. ఇప్పుడు అలాంటి కోవకు చెందిన యూఐ (UI The Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఉపేంద్ర.
ఆయనే కథ అందిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. రీష్మా నానయ్య హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను లహరి ఫిల్మ్స్ బ్యానర్ పై జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు.
అయితే మేకర్స్ రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 2040 నాటి ప్రపంచాన్ని ఉపేంద్ర సినిమాలో చూపించనున్నారని క్లియర్ గా అర్థమైంది. సమాజంలోని ఘటనలతో పాటు భవిష్యత్తు సమస్యలు ముఖ్యమైన అంశాలుగా తీసుకుని ఉపేంద్ర మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. విజువల్స్ అందరినీ కచ్చితంగా అబ్బురపరుస్తాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఉపేంద్రపై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా కొనియాడారు. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని తెలిపారు. తాను ఉపేంద్రకు పెద్ద ఫ్యాన్ గా మారానని చెప్పారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే రజినీకాంత్ తలైవా మూవీలో ఉపేంద్ర యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు.
జైపూర్ లో కూలీ షూటింగ్ జరుగుతున్న సందర్భంగా.. అమీర్‌ఖాన్ యూఐ మూవీ ట్రైలర్ కోసం మాట్లాడారు. తాను ఉపేంద్రకు పెద్ద అభిమానినని తెలిపారు. స్నేహితుడు ఉపేంద్రను పరిచయం చేస్తున్నానని, అద్భుతమైన ట్రైలర్ రెడీ చేశారని ప్రశంసించారు. హిందీ ప్రేక్షకులు కూడా ఉపేంద్రను చాలా ఇష్టపడతారని తెలిపారు. ట్రైలర్ చూసి షాకయ్యానని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఉపేంద్రను అమీర్ ఖాన్ విష్ చేయగా.. ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు కూడా ఉపేంద్రకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అదే సమయంలో యూఐ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూరైనట్లు మేకర్స్ ప్రకటించారు. యూ/ఏ సర్టిఫికెట్ జారీ అయినట్లు తెలిపారు. ఈ మేరకు పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి యూఐ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.