Begin typing your search above and press return to search.

ఉపాస‌న‌.. అత్యంత సంతోష‌క‌ర‌మైన దీపావ‌ళి

సెలబ్రిటీలు దీపావళి వేడుకలను హోస్ట్ చేయడం లేదా పార్టీలకు హాజరవుతూ బోలెడంత సంద‌డి చేసారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 3:22 PM GMT
ఉపాస‌న‌.. అత్యంత సంతోష‌క‌ర‌మైన దీపావ‌ళి
X

దీపాల పండుగ వైభ‌వాన్ని.. లైట్నింగ్ కాంతుల‌తో మిరుమిట్లను మ‌ర్చిపోలేం. 2023 దీపావ‌ళి ఇంకా స్పెష‌ల్ గా మారింది. గ‌డిచిన రెండు మూడేళ్ల పాటు క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల దీపావ‌ళి వేడుక‌ల గురించి అంత‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ ఈసారి ఫేజ్ మారింది. సెలబ్రిటీలు దీపావళి వేడుకలను హోస్ట్ చేయడం లేదా పార్టీలకు హాజరవుతూ బోలెడంత సంద‌డి చేసారు.


బాలీవుడ్ లో ఈ ఉత్స‌వాలు జోష్ ఫుల్ గా సాగాయి. మన సౌత్ సెలెబ్స్ కూడా తక్కువేమీ కాదు. దీపావళిని కూడా అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. పవర్ కపుల్ రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల హైదరాబాద్‌లోని వారి నివాసంలో భారీ పార్టీని నిర్వహించడంతో ఈ పండుగ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈసారి చోర్రోపాస‌నం ప్ర‌త్యేక పార్టీ హైలైట్ గా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సూపర్ స్టార్లు ఈ దీపావ‌ళి పార్టీకి ఎటెండ‌య్యారు. నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖులు హాజరవ్వ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

ఈ పార్టీ గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో ఆ ఆనందం ఉపాస‌న ముఖంలో అది ప్ర‌స్ఫుట‌మైంది. ఉపాస‌న ఇప్పుడు నెవ్వ‌ర్ బిఫోర్ జోయ్ ని ఆస్వాధిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఉపాస‌న ముఖంలో లైట్నింగ్ కాంతులు ఎంతో వైభ‌వంగా క‌నిపిస్తున్నాయి అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పంజాబీ డ్రెస్ లో ఉపాస‌న ఈ లుక్ లో ఎంతో సింపుల్ గా క‌నిపిస్తున్నారు.

``నేను అత్యంత సంతోషకరమైన దీపావళిని పొందాను ! నాలో ప్రేమ - కృతజ్ఞతా పటాఖాలు..

ఈ వేడుక‌ను చాలా ప్రత్యేకంగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు..`` అంటూ వేడుక‌ల‌కు హాజ‌రైన‌ అతిథులంద‌రికీ ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలిపారు ఉపాస‌న‌. సోష‌ల్ మీడియాల్లో ఉపాస‌న ఫాలోవ‌ర్స్ త‌న‌కు ప్ర‌త్యేకించి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిజంగా కొణిదెల వారి ఇంటికి ఈ దీపావ‌ళి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఉపాస‌న - రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల త‌ల్లిదండ్రులు అయ్యాక జ‌రిగిన మొద‌టి దీపావ‌ళి ఇది. బేబి కిన్ క్లారా కొణిదెల స‌మ‌క్షంలో ఈ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. దీనికి తోడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇంట్లో మ‌రో వేడుక కూడా ఉత్సాహం పెంచింది. వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి వేడుక‌లు కొణిదెల కాంపౌండ్ లో ఎంతో జోష్ ని నింపాయి.