ఇదంతా పబ్లిసిటీ స్టంటా ఊర్వశి!
సరిగ్గా ఊర్వశి రైతేలా ఇప్పుడదే చేస్తుందని నెటి జనులు ఆడేసుకోవడం మొదలు పెట్టారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో ఫోన్ పోయిందని ట్విటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Oct 2023 12:16 PM GMTవిలువైన వస్తువు ఏదైనా పొనంతవరకే జాగ్రత్తగా ఉండాలంటారు. పోయిన తర్వాత దాన్ని తిరిగి పొందడం అన్నది అసాధ్యం. చాలా రేర్ కేసెస్ లోనే అది సాధ్యమవుతుంది తప్ప! అన్నిసార్లు అది సాధ్యంకాదు. ఇక ఫోన్లు..వెలెట్లు పోతే దొరుకుతాయా? అది జరిగే పని కాదు. మరి ఇవన్నీ ఊర్వశి రౌతేలాకి తెలియదం టారా? ఎందుకు తెలియదు..కచ్చితంగా తెలుసు. కానీ ప్రచారం కావాలంటే ఏదో ఒక విషయం మీద నెట్టింట హల్చల్ చేయాలిగా.
సరిగ్గా ఊర్వశి రైతేలా ఇప్పుడదే చేస్తుందని నెటి జనులు ఆడేసుకోవడం మొదలు పెట్టారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో ఫోన్ పోయిందని ట్విటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకి పోయిన ఫోన్ తిరిగినిచ్చిన వారికి రివార్డు ఇస్తానంటూ మరో ప్రకటన చేసింది. దీంతో అమ్మడు ఇక్కడే దొరికిపోయింది. పోయిన ఫోన్ గురించి ఎందుకింత రచ్చ చేస్తుందని ..ఒక్కసారి గతంలోకి వెళ్లి చూడగా!
ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తోన్న డ్రామా అంటూ నెటి జనులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఫోన్ పోతే ఇంత సీన్ క్రియేట్ చేయాలా? దొరికితే పోలీసులు తెచ్చిస్తారు? అంతవరకూ ఆగలేదా? ఎందుకిలా ఇన్ స్టాలో టైమ్ వేస్ట్ చేస్తావంటూ మండిపడుతున్నారు. గతంలో ఓ క్రికెటర్ విషయంలో ఇలాగే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి అతన్ని డీగ్రేడ్ చేయాలని చూసిందని నెటి జనులు మండిపడు తున్నారు.
అతడికి సంబంధం లేని విషయంలో కావాలని లాగి మీడియా దృష్టిలో పడటం కోసం ఇలా చేస్తుందని కొందరు ఆరోపించారు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కకుంది. దీనికి సదరు క్రికెటర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ఫోన్ పోయిందంటూ చేస్తోన్న ప్రచారం చూస్తుంటే మీడియా అటెన్షన్ కోసమే ఇలాంటి పనులకు పూనుకుందని మండిపడుతున్నారు.