Begin typing your search above and press return to search.

రోడ్డుపై ఉర్ఫీ.. ఒక్క మాటతో షాక్

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.. ఈ పేరు వింటేనే చాలు.. ఎవరికైనా సరే విచిత్రమైన డ్రెస్సులు కచ్చితంగా గుర్తొస్తాయి.

By:  Tupaki Desk   |   4 Sep 2024 9:30 PM GMT
రోడ్డుపై ఉర్ఫీ.. ఒక్క మాటతో షాక్
X

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.. ఈ పేరు వింటేనే చాలు.. ఎవరికైనా సరే విచిత్రమైన డ్రెస్సులు కచ్చితంగా గుర్తొస్తాయి. ఎప్పటికప్పుడు కొత్త రకం డ్రెస్సులు వేసుకుని సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తుంటోంది అమ్మడు. తన బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ తో షాకులు ఇస్తూనే ఉంటోంది. చెత్త సంచులు, గడియారాలు, పూలు, పిన్నులు, వాచులు.. అలా ఒకటి కాదు రకరకాల ఐటమ్స్ తో ఉన్న డ్రెస్సులను వేసుకుంటూ ఉంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా.. తన డ్రెస్సింగ్ లో ఎలాంటి మార్పులు చేసుకోదు.

తన దారి తనదే అన్నట్లుగా వింతైన ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది అమ్మడు. విచిత్రమైన అవతారాల్లో కనిపిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంటోంది. కొద్ది రోజులుగా తన ప్రజలను ఆకట్టుకునే విధంగా డ్రెస్సులు వేసుకుని ముంబై వీధుల్లో తిరుగుతోంది. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట.. ఫుల్ వైరల్ అవుతూనే ఉన్నాయి. సినిమాల కన్నా తన విభిన్నమైన డ్రెస్సింగ్‌ స్టైల్ తో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది ఉర్ఫీ జావెద్.

అయితే రీసెంట్ గా తనకు చేదు అనుభవం ఎదురైనట్లు సోషల్ మీడియాలో తెలిపింది ఉర్ఫీ. చాలా అసౌకర్యంగా అనిపించినట్లు చెప్పింది. "నిన్న నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్తున్నప్పుడు అటు వైపు కొందరు కురాళ్లు గుంపుగా వచ్చారు. అందులో ఒక అబ్బాయి.. నీ బాడీ కౌంట్ ఎంత అని అడిగాడు. అతడి వయసు 15 ఏళ్ల లోపే ఉంటుంది. నా తల్లితోపాటు కుటుంబ సభ్యుల ముందు అలా బిహేవ్ చేశాడు" అని ఇన్ స్టా స్టోరీలో ఆవేదన వ్యక్తం చేసింది ఉర్ఫీ.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే ఉర్ఫీ జావేద్ లైఫ్ స్టైల్ మిగతా సెలబ్రిటీల కంటే చాలా భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె జీవిత నేపథ్యంపై తెరకెక్కిన ఫాలో కర్ లో యార్ వెబ్ సిరీస్.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉర్ఫీ రియల్ లైఫ్ కు సంబంధించిన పూర్తి సమాచారంతో వచ్చిన ఆ సిరీస్.. స్ట్రీమింగ్ కు ముందు ఆమె బాగా ప్రమోషన్స్ చేపట్టింది.

ఆ సమయంలో ఉర్ఫీ చేసిన కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. సమంత, తాను ఇన్ స్టా ఫ్రెండ్స్ అని చెప్పింది. అర్జున్ కపూర్‌ అంటే చాలా ఇష్టమని చెప్పింది. శృ*గారం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే కొన్నాళ్ల క్రితం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన అమ్మడు.. దాని ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు స్పెషల్ గా డిజైన్ చేసుకున్న డ్రెస్సులతో సందడి చేస్తోంది.