Begin typing your search above and press return to search.

మొద‌ట్లో షాక‌య్యాను కానీ.. ఉర్ఫీ మామ్..

వింతైన ఫ్యాష‌న్ ఎంపిక‌ల‌తో నిరంత‌రం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంది ఉర్ఫీ జావేద్. ఈ బ్యూటీ తెలివైన ఎంపిక‌లు, బోల్డ్ ఫోటోషూట్ల గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   20 Feb 2025 3:47 AM GMT
మొద‌ట్లో షాక‌య్యాను కానీ.. ఉర్ఫీ మామ్..
X

వింతైన ఫ్యాష‌న్ ఎంపిక‌ల‌తో నిరంత‌రం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంది ఉర్ఫీ జావేద్. ఈ బ్యూటీ తెలివైన ఎంపిక‌లు, బోల్డ్ ఫోటోషూట్ల గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. అయితే ఆరంభం ఉర్ఫీ వింత ఫ్యాష‌న్ సెన్స్ కి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోగా, ఇప్పుడు సెల‌బ్రిటీలు సైతం త‌న ఫ్యాష‌న్ సెన్స్ ని ప్ర‌శంసిస్తున్నారు. ఉర్ఫీ ఫ్యాష‌న్ సెన్స్ కి భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

అయితే త‌న కుమార్తె ఫ్యాష‌న్ సెన్స్ గురించి ఆమె త‌ల్లి జ‌కియా ఏమ‌న్నారు? అంటే.. ఉర్ఫీ జావేద్ తల్లి జకియా జియో హాట్‌స్టార్ షో- జనరేషన్ ఆజ్ కల్ విత్ ఫంచో ఎపిసోడ్‌లో వెల్ల‌డించారు. షో ప్రోమోలో జకియా హోస్ట్‌ల‌తో మాట్లాడుతూ ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

మొదట్లో ఉర్ఫీ ఫ్యాషన్ ఎంపికలు చూసాక‌, తాను షాక్ అయ్యానని, కానీ అలాంటి ఎంపికలలో తన కుమార్తె ఆత్మ‌విశ్వాసం క‌ట్టిప‌డేసింద‌ని, అందులో త‌న ప్ర‌తిభ‌ను సౌక‌ర్యాన్ని గుర్తించాక‌.. ఆమెకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాన‌ని అన్నారు షోలోకి తన తల్లితో పాటు వచ్చిన ఉర్ఫీ కుటుంబంలో మొదటగా బోటాక్స్ చేయించుకున్నది తన తల్లి అని కూడా వెల్లడించింది. మనం బయటికి ఎలా క‌నిపించినా, మన అంతర్గత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాల‌ని ఉర్ఫీ వ్యాఖ్యానించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఉర్ఫీ జావేద్ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ షో `ఎంగేజ్డ్: రోకా ఆర్ ధోకా`లో న‌టిస్తున్నారు. ఈ షోని హర్ష్ గుజ్రాల్‌తో కలిసి ఉర్పీ హోస్ట్ చేయనుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ఫాలో కార్లో యార్‌లో కూడా ఈ భామ అద్భుతంగా న‌టించింది.