సమంత-ఉర్పీజావేద్ మధ్య ప్రెండ్ షిప్!
ఓర్రీ నటుడు కాకపోయినా బాలీవుడ్ సెలబ్రిటీలందరితో మంచి స్నేహం ఉంది.
By: Tupaki Desk | 29 Aug 2024 1:30 AM GMTఉర్పీ జావేద్ పరిచయం అవసరం లేని పేరు. నటి కాకపోయినా అంతకు మించిన పాపులారిటీని సోషల్ మీడియాలో కలిగి ఉంది. వింతైన దుస్తుల్లో తానో బ్రాండ్ అని ప్రూవ్ చేసుకుంది. ఇదే అమ్మడికి నెట్టింట వివిపరీతమైన ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. అలాగని ఈ భామ ఓర్రీలా సెలబ్రిటీల్లో ఫేమస్ కాలేదు. ఓర్రీ నటుడు కాకపోయినా బాలీవుడ్ సెలబ్రిటీలందరితో మంచి స్నేహం ఉంది.
కానీ ఉర్పీ జావేద్ కి మాత్రం ఇంతవరకూ అలాంటి స్నేహితులు లేరు. మరి అలాంటి ఉర్పీతో సమంత స్నేహం చేస్తుందా? అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమంత తనకు మంచి ప్రెండ్ అంటూ ఉర్పీ విషయాన్ని రివీల్ చేసింది. ఫాలో కర్ లో యార్ షోలో ఈ విషయాన్ని చెప్పింది. `బాలీవుడ్ నుంచి నాకు ఎలాంటి స్నేహితులు లేరు. కానీ ఇటీవల సమంత వర్చువల్ స్నేహితురాలు అయింది.
ఇద్దరం ఇన్ స్టా గ్రామ్ స్నేహితులం. ఆమెకి నావీడియోలు నచ్చితే గనుక తన స్టోరీస్ లో అప్లోడ్ చేస్తుంది. దీని వెనుక మరో ఉద్దేశం ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆమె నాకు నిజమైన మద్దతు అందిస్తుంది. మొత్తానికి ఉర్పీజావేద్ కి సమంత రూపంలో మంచి స్నేహితురాలు దొరికిందనొచ్చు. ఉర్పీ క్రియేటివ్ డిజైనర్ దుస్తుల్లో ఎంతో ప్రత్యేకతని కలిగి ఉంది. కానీ బాలీవుడ్ నటీమణులు ఎవరూ ఆమెకు ఇంతవరకూ మద్దతివ్వలేదు.
తొలిసారి సమంత ఆమె ప్రతిభను గుర్తించి తన ఖాతాల్లో పోస్ట్ చేయడం ద్వారా మరింత ఐడెంటిటీ దక్కింది. ఆరకంగా ఉర్పీ జావేద్ కి అమ్మడు చాలా పెద్ద సహాయం చేసినట్లే. అంతే మంచి హృదయంతో ఉర్పీని సినిమాలకు కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుందంటూ నెటి జనులు అభిప్రాయపడుతున్నారు.