బిగ్ సర్‌ప్రైజ్: ఊర్ఫీతో సమంత స్నేహం?
అయితే ఒక సెక్షన్ ఊర్ఫీ డీగ్రేడ్ నటి అంటూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Feb 2025 12:44 PM GMTబాలీవుడ్ లో విలక్షణమైన ఫ్యాషనిస్టాగా ఊర్ఫీ జావేద్ పేరు మార్మోగుతోంది. ఫ్యాషన్ ఎంపికల విషయంలో ఇతరులకు చాలా భిన్నంగా ఆలోచించే ఈ భామ ఎప్పుడూ ఎదో ఒక ప్రయోగంతో జనంలో హాట్ టాపిగ్గా మారుతోంది. టూమచ్ బోల్డ్ సెలెక్షన్ అమ్మడిని ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంచుతోంది. అయితే ఒక సెక్షన్ ఊర్ఫీ డీగ్రేడ్ నటి అంటూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఊర్ఫీపై ఎన్ని కామెంట్లు వినిపించినా తన ఫ్యాషన్ సెన్స్ ని అగ్ర శ్రేణి నటీమణులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకుముందు ఊర్ఫీ ఫ్యాషన్ ఎక్స్ పెరిమెంట్స్ పై సమంత ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాల్లో ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు టచ్ లోనే ఉన్నారు.
తాజాగా ఊర్ఫీ .. సమంతతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేయడం, దానికి ప్రతిస్పందిస్తూ సమంత పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సమంతతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన ఊర్ఫీ.. దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ''ఫోటో అస్పష్టంగా ఉంది కానీ ఇష్టమైన అమ్మాయిలు'' అని క్యాప్షన్ ఊర్ఫీ ఇచ్చింది. ఈ ఫోటోలో ఊర్ఫీ, సమంత చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇప్పుడు ఊర్ఫీ షేర్ చేసిన ఫోటోని తిరిగి షేర్ చేస్తూ సమంత ప్రతిస్పందించారు. ''చివరికి నేను నిన్ను కలిశాను, ఉర్ఫీ'' అని సామ్ రాసింది. దీనిని బట్టి ఆ ఇద్దరూ స్నేహితులు అని అర్థమవుతోంది.
సమంత ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో 'సిటాడెల్: హనీ బన్నీ'లో వరుణ్ ధావన్‌తో కలిసి కనిపించింది. ఆ తర్వాత రక్త బ్రహ్మండ్‌లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.