వైట్ అండ్ వైట్ లో ఉర్పీ..ఇది బాబు రావు స్టైల్!
తాజాగా వైట్ అండ్ వైట్ లో సంప్రదాయంగా కనిపిస్తుంది. వైట్ టీషర్ట్....ప్యాంట్ ధరించింది. ఆ పక్కనే ఉర్పీ స్నేహితురాలు కూడా ఉంది.
By: Tupaki Desk | 13 Oct 2023 7:06 AM GMTఇంటర్నెట్ సంచలనం ఉర్పీ జావెద్ పరిచయం అవసరం లేని పేరిప్పుడు. డిజైనర్ దుస్తుల్లో హాట్ అప్పీరియన్స్ తో ఆకట్టుకోవడం అమ్మడి స్పెషాల్టీ. ప్రపంచంలోనే ఆమె అంత గొప్ప ఫ్యాషనిస్ట్ లేరు అనిపిస్తుంది. కేవలం ప్రయివేట్ భాగాలు మాత్రమే కప్పిపుచ్చుకుని మిగతా శరీరమంతా కనిపించేలా! డిజైనర్ దుస్తుల్లో మురిపించడం బ్యూటీ ప్రత్యేకత. తనకోసమే అంటూ ప్రత్యేకంగా డిజైన్ చేయించు కుంటుంది.
ఎందుకంటే ఇలాంటి దుస్తులు కేవలం ఉర్పీ మాత్రమే కనిపిస్తుంది. తనకంటికి ఏది కనిపించినా..దాన్ని క్రియేటివ్ గా డిజైన్ చేసి మార్కెట్ లోకి వచ్చేస్తుంది. ఆరకంగా ఉర్పీ జావెద్ నెట్టింట పాపులారిటీ సంపాదించింది. అమ్మడి డిజైన్స్ ప్రత్యేకమైన స్టైల్ అంటూ ఏం లేదు. ఆమె ఏ డిజైన్ ఎంపిక చేసుకున్నా! అదొ కొత్త రకమైన పేరు పెట్టని డిజైన్ గానే చెప్పుకోవాలి. తాజాగా అమ్మడు వైంట్ అండ్ వైట్ లోకి దూరిపోయింది.
రోజూ డిజైనర్ దుస్తుల్లో కనిపించే సరికి ఉర్పీకి బోర్ కొట్టేసిందే? ఏమో గానీ తాజాగా వైట్ అండ్ వైట్ లో సంప్రదాయంగా కనిపిస్తుంది. వైట్ టీషర్ట్....ప్యాంట్ ధరించింది. ఆ పక్కనే ఉర్పీ స్నేహితురాలు కూడా ఉంది. ఇద్దరు కలిసి వస్తుండగా....షూట్ చేసిన వీడియో ఇది. వీళ్లు అలా బయటకు రావడంతో కెమెరాలన్ని వాళ్ల వెంట పడ్డాయి. అంతా ఇదేం స్టైల్ అంటే ఇది `బాబురావు` స్టైల్ అంటూ ఉర్పీ సమాధానం ఇచ్చింది.
సహజంగా ఈ ప్రశ్న ఉర్పీ అన్ని డిజైన్స్ క వినిపిస్తుంది. వాటికి ఏదో ఒక డిజైన్ పేరు చెబుతుంది. కానీ పద్దతైన దుస్తుల్లో కనిపించే సరికి అమ్మడు బాబురావు స్టైల్ అంటూ తనదైన శైలిలో నవ్వించింది. దీంతో కింద కామెంట్ బాక్సులకు పెద్ద పనే పడింది. ఉర్పీ బాబురావు స్టైల్ బాగుంది... స్టైల్ కన్నా ఆస్టైల్ కి పెట్టిన పేరు బాగుందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.