వీడియో: బిగ్ బాస్ బ్యూటీ తాగి తందనాలు
మైమరిచి పార్టీల్లో తాగి తందనాలాడటం.. డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం వంటి వ్యసనాలు చాలా మంది ఔత్సాహిక నటీనటులను సర్వనాశనం చేసాయి.
By: Tupaki Desk | 8 July 2024 3:35 PM GMTముంబై నైట్ పార్టీ కల్చర్ గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీ ప్రపంచంలో నిత్యం పార్టీల సందడి ఉంటూనే ఉంటుంది. అయితే ఈ పార్టీల్లో అదుపు తప్పనివారు మాత్రమే చివరి వరకూ నిలబడతారు. మైమరిచి పార్టీల్లో తాగి తందనాలాడటం.. డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం వంటి వ్యసనాలు చాలా మంది ఔత్సాహిక నటీనటులను సర్వనాశనం చేసాయి.
ఇక బాలీవుడ్ లో అప్ కం స్టార్లు, టీవీ నటీమణులు, మోడల్స్ కూడా పార్టీల్లో ఎక్కువగా సందడి చేయడానికి కారణం అవకాశాలు దొరికే ఏకైక చోటుగా దానిని భావిస్తారు గనుకే. ఇప్పుడు అభినవ తారక, బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తాగి ఊగుతున్న ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ముంబైలో పార్టీ తర్వాత ఊర్ఫీ నడవడానికి కష్టపడుతున్న వైరల్ వీడియో హాట్ టాపిక్ గా మారింది. ఉర్ఫీ జావేద్ శనివారం రాత్రి ఓ పార్టీలో మద్యం తాగి ఉండొచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. ఆన్‌లైన్‌లో షేర్ అయిన ఒక వీడియో కారణంగా ఈ పుకార్ షికార్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఎవరి సాయం లేకుండా ఊర్ఫీ నడవడానికి చాలా కష్టపడుతోంది. ఊర్ఫీ పార్టీ నుంచి వస్తూ కొందరు స్నేహితులతో కలిసి కనిపించారు
నిజంగా ఊర్ఫీ ఫుల్ గా మత్తులో ఉన్నట్టే అర్థమైంది తన తప్పటడుగులు చూశాక... పార్టీ తర్వాత బయటకు వెళ్లేటప్పుడు ఉర్ఫీని తన కారు వద్దకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే తనను వెంటాడుతున్న కెమెరాలకు ఉలిక్కి పడి తమాయించుకునేందుకు ఉర్ఫీ ప్రయత్నిస్తోంది. తన స్నేహితురాలిని పట్టుకుని కారు ఉన్న స్థలం వరకూ వెళుతూ కనిపించింది. అయితే ఊర్ఫీ కార్ వద్దకు వెళ్లేప్పుడు స్నేహితురాలు కెమెరామెన్‌ని వెనక్కి వెళ్లమని అభ్యర్థించింది.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఊర్ఫీ పార్టీలో ఫుల్ గా తాగి ఉండవచ్చని చాలా మంది ఊహించారు. ''ఆమె చాలా తాగి ఉంది'' అని ఒక అభిమాని ఊహించాడు. మొదటి కొన్ని అడుగులు నాటకీయంగా సాగి, అటుపై బాగానే నడిచింది.. తర్వాత తల తిరగడం ప్రారంభించింది. ఆ కళ్ళు 1 శాతం కూడా తాగినట్టు లేవు... ఊర్ఫీని 'డ్రామా క్వీన్' అని కూడా ఒకరు కామెంట్ చేసారు. హహహ..ఆమె పూర్తిగా తాగి ఉంది..కాదు ఆమె డ్రామా క్వీన్ యాక్టింగ్ చేస్తోంది! అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఇటీవల ఇద్దరు భార్యల ముద్దుల భర్త ఆర్మాన్ మాలిక్ (యూట్యూబర్)ని సమర్థిస్తూ ఊర్ఫీ చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. కానీ ఆర్మాన్ కి ఊర్ఫీ తన సంపూర్ణ మద్ధతును అందించింది. ఇష్టపూర్వకంగా ఆ ముగ్గురూ కలిసి ఉన్నప్పుడు తీర్పులు చెప్పేందుకు మీరు ఎవరు? అంటూ వారికి మద్ధతుగా నిలిచింది. నేను కలుసుకున్న వారిలో ఆ ముగ్గురూ ఎంతో మంచి వ్యక్తులు అని కూడా కితాబిచ్చింది.