రహస్యంగా ఇన్ స్టా సంచలనం ఎంగేజ్ మెంట్!
బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెబుతూ పెళ్లికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఉర్పీ జావెద్ ఓ వ్యక్తితో ఆమె పూజలో కూర్చున్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 4 Oct 2023 11:17 AM GMTఇన్ స్టా సంచలనం ఉర్పీ జావెద్ గురించి పరిచయమవసరం లేదు. సినిమా నటి కాకపోయినా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న భామ. తనదైన శైలి డ్రెస్ లతో..అలకరణతోనే బోలెడంత ఫేమస్ అయింది. ఆ రకంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. కాదేది కవితకనర్హం అన్నట్లుగా పనికిరాని సాతసామాన్లను కూడా వస్త్రాలుగా మలిచి ధరించడం అన్నది ఉర్పీకే చెల్లింది.
అలా చేసింది కాబట్టి నెట్టింట వరల్డ్ లో అంత పాపులర్ అయింది. బాలీవుడ్ హీరోయిన్లకే లేని క్రేజ్ ని అమ్మడు దక్కించుకుందంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఈ సంచలన ఇన్ స్టా క్వీన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెబుతూ పెళ్లికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఉర్పీ జావెద్ ఓ వ్యక్తితో ఆమె పూజలో కూర్చున్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ పూజలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వెనుక..ముందు ఎవరూ కనిపించలేదు. దీంతో ఇద్దరు రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారంటూ నెట్టింట ప్రచారం అందుకుంది. ఆ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరూ అంటూ నెటి జనులు ఆరా తీయడం మొదలు పెట్టారు. బేసిక్ గానే ఉర్పీ ప్రీ బర్డ్ కాబట్టి! తన ఎంగేజ్ మెంట్ కి అందర్నీ ఎందుకు ఆహ్వానిస్తుందంటూ ఓనెటి జనుడు కామెంట్ పెట్టాడు.
అప్పుడే పెళ్లి చేసుకుంటే ఎలా ఉర్పీ అంటూ మరికొంత మంది ఫీలైపోతున్నారు. అయితే నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా ఉర్పీ జావెద్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఇది నిజంగా ఎంగేజ్ మెంట్ నా? లేక ఏదైనా పూజలో పాల్గొందా? అన్నది క్లారిటీ రాలేదు. అమ్మడు వీటన్నింటికి ఎలాంటి బధులిస్తుందా? అని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఉర్పీ జావెద్ తొలుత హిందీలో కొన్ని సీరియల్స్ చేసింది. ఆతర్వాత ఇలాగైతే లాభం లేదనుకున్న భామ తన ట్యాలెంట్ ని ఇన్ స్టా ద్వారా చాటే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది.