#గుసగుస.. ఊర్మిళ మటోండ్కర్ విడాకులు?
ఊర్మిళ మటోండ్కర్ పరిచయం అవసరం లేదు. జేడి చక్రవర్తి- కృష్ణవంశీ కాంబినేషన్ మూవీ `గులాబీ`లో నటించింది.
By: Tupaki Desk | 25 Sep 2024 7:21 AM GMTఊర్మిళ మటోండ్కర్ పరిచయం అవసరం లేదు. జేడి చక్రవర్తి- కృష్ణవంశీ కాంబినేషన్ మూవీ `గులాబీ`లో నటించింది. సంచలనాల `రంగీలా` చిత్రంలో యాయిరే యాయిరే .. పాటతోను ఒక ఊపు ఊపిన ఊర్మిలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. కానీ ఊర్మిల ఇటీవల నటనకు దూరంగా ఉన్నారు. అయితే ఈ సీనియర్ నటి తన 50 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించికపోయినా ఈ టైమ్స్ లోని కథనం దీనిని ధృవీకరించింది.
పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత ఊర్మిళ మటోండ్కర్ తన భర్త మొహ్సిన్ అక్తర్ మీర్ నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, నాలుగు నెలల క్రితం ఈ ప్రాసెస్ ప్రారంభమైందని ఈటైమ్స్ పేర్కొంది. హిందుస్థాన్ టైమ్స్‌లోని మరో నివేదిక ప్రకారం ఊర్మిళ -మొహ్సిన్ విడిపోవడం పరస్పర ఒప్పందం, నియమాల ద్వారా జరిగే ప్రక్రియ అని తెలుస్తోంది. కోర్టు నుండి ఒక అనామక మూలం వివరాల ప్రకారం... కొన్ని కారణాలతో ఊర్మిళ తన భర్త మొహ్సిన్ తో బంధాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ఇప్పటికే కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసింది. విడిపోవడానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది పరస్పర నిబంధనలపై జరుగుతుందని వెల్లడైంది.
బాలీవుడ్ నటి ఊర్మిళ - కాశ్మీరీ వ్యాపారవేత్త కం మోడల్ అయిన మొహ్సిన్ ఎనిమిదేళ్ల క్రితం కొద్దిమంది బంధుమిత్రులు , కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లాడారు. వారు తమ స్నేహితుడు, బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ద్వారా కలుసుకున్నారు. 4 ఫిబ్రవరి 2016న వీరికి పెళ్లయింది. 10 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈ జంట భాగస్వామ్య విలువలు, ఆసక్తులు కలవడం ద్వారా బంధం కొనసాగింది. అయితే వారి విడాకుల వార్తలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే ఈ జంట పబ్లిక్ కి స్వచ్ఛమైన ప్రేమ జంటగా కనిపించింది.