ఇలా అయితే RGV 'రంగీలా 2' తీస్తాడేమో?
ఇటీవలే ఊర్మిళ మటోండ్కర్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా చాలా సరదాగా గడిపిన ఫోటోలు వీడియో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
By: Tupaki Desk | 19 Feb 2024 3:59 AM GMTఆర్జీవీ తెరకెక్కించిన 'అంతం' అనే సినిమాతో ఊర్మిలా మఠోండ్కర్ తెలుగు తెరకు పరిచయమైంది. గాయం, మనీ మనీ (స్పెషల్ నంబర్) లాంటి సినిమాల్లోను నటించింది. అంతకుముందే ఊర్మిల మలయాళంలోను కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత హిందీలో ఆర్జీవీ 'రంగీలా' పెను సంచలనంగా మారడంతో అసాధారణ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేసింది. రంగీలా, సత్యా లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఊర్మిల హిందీ చిత్రసీమలో ఎదురేలేని కథానాయికగా ఎదిగింది. దశాబ్ధం పైగానే స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది
.
ఇటీవలే ఊర్మిళ మటోండ్కర్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా చాలా సరదాగా గడిపిన ఫోటోలు వీడియో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. బహు భాషలలో అద్భుత నటప్రదర్శనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఊర్మిల ఇప్పటికీ 20 ప్లస్ నాయికగానే అభిమానుల కళ్లలో ఉంది. బాలనటిగా, కథానాయికగా, ఐటమ్ క్వీన్ గా ఊర్మిల అసాధారణ ప్రయాణాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
హిందీలో.. జుదాయి, రంగీలా, భూత్, వో కౌన్ థీ సహా మరిన్ని చిత్రాలతో వెండితెరపై ఐకానిక్ స్టార్ గా నిరూపించారు. అనుభవజ్ఞురాలైన సీనియర్ నటిగా ఇప్పటికీ గౌరవం అందుకుంటున్నారు. ''నా జీవితంలో చాలా అద్భుతమైన విషయాలున్నాయి. గొప్ప వ్యక్తులు నన్ను గొప్పగా ఆశీర్వదించినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలి'' అంటూ ఇటీవల బర్త్ డే సందర్భంగా రాసిన ఓ పోస్ట్ లో ఎమోషనల్ అయ్యారు. నా జీవితంలో ఉత్తానపతనాలున్నాయి.
జీవితలో శిఖర స్థాయి అనేది కేవలం తాత్కాలికమని నాకు తెలుసు. చీకటి సమయాల్లో సొరంగం చివరిలో వేచి ఉండే కాంతిని నేను విశ్వసించాను. కష్టాలను మించిన వరం ఇంకేదీ లేదు! అని ఊర్మిల వ్యాఖ్యానించారు. నాతో కలిసి ఈ ప్రయాణంలో భాగమైనందుకు నేను పరిపూర్ణతకు దూరంగా ఉన్నా, తీవ్రమైన మానవత్వం ఉన్న వ్యక్తిగా నన్ను చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని కూడా రాసారు.
ఊర్మిల షేర్ చేసిన తాజా ఫోటోషూట్ అభిమానుల్లో వైరల్‌గా మారింది. దీనికి బ్లాక్ ఇన్ వైట్ వరల్డ్ అనే అందమైన క్యాప్షన్ ని ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ నేపథ్యంలో ఫోటోగ్రాఫ్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 50 వయసులోను 20లో ఉన్నంత ఫిట్‌గా కనిపిస్తున్న ఊర్మిల ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తారా? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 50లోను ఊర్మిల ఇంతందంగా ఉంది.. ఆర్జీవీ 'రంగీలా 2' కోసమేనా? అని కూడా ప్రశ్నించాడు ఒక అభిమాని. అయితే దీనికి ఆర్జీవీ నుంచి సమాధానం రావాల్సి ఉంటుంది.