Begin typing your search above and press return to search.

డాకు తర్వాత టాలీవుడ్‌లో ఊర్వశి ఫ్యూచర్‌ ఏంటి?

దాంతో తన నటన విశ్వ రూపం చూపించి తన ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు చూపించుకునే అవకాశం దక్కిందని ఊర్వశి సంతోషం వ్యక్తం చేసింది.

By:  Tupaki Desk   |   14 Jan 2025 5:22 AM GMT
డాకు తర్వాత టాలీవుడ్‌లో ఊర్వశి ఫ్యూచర్‌ ఏంటి?
X

బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ఊర్వశి రౌతేలా గత రెండు మూడు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. అయితే ఇప్పటి వరకు స్పెషల్‌ పాటలతోనే అలరించిన ఊర్వశి మొదటి సారి బాలకృష్ణ డాకు మహారాజ్‌ సినిమాలో మెయిన్‌ లీడ్‌లో కనిపించింది. బాలకృష్ణకు జోడీగా కాకున్నా సినిమాలో ముఖ్య పాత్రలో ఊర్వశి నటించి మెప్పించింది. ఆమె కేవలం గ్లామర్‌ సన్నివేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక మంచి యాక్షన్‌ సీన్‌ సైతం ఆమెకి పడింది. దాంతో తన నటన విశ్వ రూపం చూపించి తన ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు చూపించుకునే అవకాశం దక్కిందని ఊర్వశి సంతోషం వ్యక్తం చేసింది.

డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్‌లోనూ ఊర్వశి చాలా యాక్టివ్‌గా కనిపించిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌లోని ఇతర హీరోయిన్స్ మాదిరిగా నటించి వెళ్లి పోకుండా దాదాపు వారం రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి సినిమా ప్రమోషన్‌లో ఊర్వశి పాల్గొంది. సినిమా విడుదలైన తర్వాత కూడా ఆమె హైదరాబాద్‌లో కనిపించింది. సక్సెస్ పార్టీలో సందడి చేసింది. బాలకృష్ణతో మరోసారి దబిడిదిబిడి పాటకు డాన్స్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఎంతగా స్కిన్‌ షో చేసినా ఎబ్బెట్టుగా కనిపించక పోవడం ఈమె ప్రత్యేకత. అందుకే ఈ అమ్మడికి టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటించే అవకాశాలు ముందు ముందు వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఐటెం సాంగ్స్‌కి పరిమితం కాకుండా మరిన్ని మంచి పాత్రలు చేసేందుకు ఈ అమ్మడికి అవకాశాలు రావచ్చు. ఒక అడుగు ముందుకు వేసి ఈమెకు యాక్షన్ ఓరియంటెడ్‌ లేడీ సెంట్రిక్‌ సినిమాలోనూ నటించే అవకాశాలు రావచ్చు అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఈ అమ్మడికి టాలీవుడ్‌లో వచ్చే పాత్రలను బట్టి ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి మాస్ ఆడియన్స్‌తో దబిడి దిబిడి డాన్స్ చేయించిన ఊర్వశి రౌతేలా వచ్చే ఏడాది మళ్లీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.

బాబీ దర్శకత్వంలో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ ఈ అమ్మడు ఐటెం సాంగ్‌ చేసింది. చిరంజీవితో డాన్స్ చేసినా ఆ తర్వాత ఎక్కువ ఆఫర్లు రాలేదు. కానీ ఈసారి డాకు మహారాజ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా ముందు ముందు ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తాయని అంటున్నారు. డాకు మహారాజ్‌ సినిమాకు పాజిటివ్ టాక్‌ దక్కింది. విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపుగా రూ.40 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో సినిమా బ్రేక్‌ ఈవెన్ సాధించవచ్చు అనే టాక్ వినిపిస్తుంది.