Begin typing your search above and press return to search.

ఊర్వ‌శి ఉద్ధేశం? ఉన్న మ‌తి చెడిందా!

ఊర్వశి వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో వేగంగా వైర‌ల్ అయ్యాయి. ఇది చాలా పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. కొందరు ఈ భామ‌ను అహంకారి అని విమర్శించారు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 4:02 AM GMT
ఊర్వ‌శి ఉద్ధేశం? ఉన్న మ‌తి చెడిందా!
X

సంక్రాంతికి విడుదలైన సినిమాలలో శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలమైంద‌ని ట్రేడ్ విశ్లేషించింది. రామ్ చరణ్ - కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. మరోవైపు బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' ఇప్పటివరకు మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. బాల‌య్యతో 'ద‌బిడి దబిడి' పాట చేయడం తప్ప సినిమాలో అంత‌గా ప్రాముఖ్యత లేని గ్లామరస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఈ స‌క్సెస్ వెన‌క త‌న పాత్ర గురించి ఎక్కువ‌గా ప్ర‌స్థావిస్తోంది. ఈ భామ స్వీయ ప్రాప‌కం పాకులాట‌ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

ఒక ఇంట‌ర్వ్యూలో 'గేమ్ ఛేంజ‌ర్' ఫ్లాపైన విష‌యాన్ని కూడా ఊర్వ‌శి గుర్తు చేసింది. ఈ ఫ్లాప్‌లో కియారా అద్వానీ తప్పు లేదని, డాకు మ‌హారాజ్ స‌క్సెసైతే అందులో త‌న‌ త‌ప్పేమీ లేద‌ని కూడా వ్యాఖ్యానించ‌డం ద్వారా గేమ్ ఛేంజ‌ర్ ఫ్లాప్ ని తాను సెల‌బ్రేట్ చేసుకుంటున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది. దీంతో ఊర్వశి వ్య‌వ‌హారంపై మెగా ఫ్యాన్స్ సీరియ‌స్ గా ఉన్నారు. నేను న‌టించిన డాకు మ‌హారాజ్ 100 కోట్లు వ‌సూలు చేసిందంటూ ఆనందించినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు కానీ.. 'గేమ్ ఛేంజ‌ర్' ఫ్లాపైంద‌ని ప‌రోక్షంగా విమ‌ర్శించ‌డాన్ని కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఊర్వశి వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో వేగంగా వైర‌ల్ అయ్యాయి. ఇది చాలా పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. కొందరు ఈ భామ‌ను అహంకారి అని విమర్శించారు. రోజురోజుకూ ఊర్వ‌శికి ఉన్న మ‌తి చెడుతోందంటూ కొంద‌రు తిట్టారు. ఒక హిట్ సినిమా చూసుకునే ఇలా ప్రవర్తిస్తోంది.. అసూయ దేనికి? అంటూ ఒక‌రు వ్యాఖ్యానించారు. ఓ వైపు ఈ విమ‌ర్శ‌లు ఇలా ఉండ‌గానే, ఊర్వ‌శి క్రిప్టిక్ పోస్టులు వైర‌ల్ గా మారాయి. ఈసారి పీఆర్వోల‌ను ఉద్దేశించి ఊర్వ‌శి చేసిన ట్వీట్లు చ‌ర్చ‌ల్లోకొచ్చాయి.

''ఒక భారీ ఫ్లాప్ నుంచి అసూయ‌? పెయిడ్ పీఆర్ నిజమైన ప్రతిభను, కృషిని కప్పివేయలేదు!'' అని ఒక పాత‌ పోస్ట్ లో రాసిన ఊర్వ‌శి.. మరొక పోస్ట్‌లో ''వైఫల్యం అసూయను పెంచినప్పుడు, పెయిడ్ పీఆర్ కూడా నిజమైన విజయాన్ని మరుగుపరచలేదు!'' అని రాసింది. మొత్తానికి త‌న సినిమా 'డాకు మ‌హారాజ్‌' విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేస్తూ..ఫెయిలైన చిత్రాన్ని ఊర్వ‌శి ప‌దే ప‌దే టార్గెట్ చేయ‌డం అంద‌రి దృష్టికి వ‌చ్చింది. ఊర్వ‌శికి ఉన్న మ‌తి చెడిందా! ఈ వేషాలు దేనికీ? అంటూ నెటిజ‌నులు ప్ర‌స్తుతానికి సీరియ‌స్ గా ఉన్నారు.