కావాలనే బాత్‌రూం వీడియో లీక్..!
టాలీవుడ్‌లో తనకు భారీ విజయం దక్కిందని ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
By: Tupaki Desk | 22 Jan 2025 5:27 AM GMTతెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి 'డాకు మహారాజ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు బాలకృష్ణతో కలిసి వేసిన దబిడి దిబిడి స్టెప్స్ వివాదాస్పదం కావడంతో పాటు వైరల్ అయిన విషయం తెల్సిందే. డాకు మహారాజ్ సినిమాలో కేవలం పాటకే పరిమితం కాకుండా కీలక పాత్రలో నటించింది. ఒక యాక్షన్ సన్నివేశంలోనూ ఊర్వశి రౌతేలా మెప్పించింది. ప్రస్తుతం ఊర్వశి డాకు మహాజార్ హిట్‌ని ఎంజాయ్ చేస్తుంది. టాలీవుడ్‌లో తనకు భారీ విజయం దక్కిందని ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ముందు ముందు మరిన్ని సినిమాలు చేయబోతున్నట్లు పేర్కొంది.
ఆ ఇంటర్వ్యూలో తన లీక్ వీడియో గురించి స్పందించింది. గత ఏడాది ఊర్వశి రౌతేలా నటించిన 'ఘుస్పైతియే' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు కొన్ని వారాల ముందు ఊర్వశి రౌతేలా యొక్క బాత్ రూం వీడియో లీక్ అయ్యింది. ఆ సినిమాలోని సన్నివేశం సోషల్ మీడియా ద్వారా లీక్ అయ్యింది. లీక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాకుండా సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగేలా చేసింది. ఊర్వశి బాత్ రూంలో డ్రెస్ విప్పుతున్న వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోను ఊర్వశి తొలగించింది. ఆ వీడియోపై ఇన్ని నెలల తర్వాత ఊర్వశి రౌతేలా స్పందించింది.
ఘుస్పైతియే సినిమా నిర్మాతలు విడుదలకు కొన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చారు. సినిమా నిర్మాణం కోసం చాలా ఖర్చు చేశాం, మేము సినిమా కోసం మా ఆస్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా జనాల్లోకి వెళ్లాలి అంటే మీరు ఆ వీడియోను లీక్ చేయాలి, తద్వారా సినిమాకు బజ్ క్రియేట్ అవుతుంది అని వేడుకున్నారు. దాంతో వారి పరిస్థితిని అర్థం చేసుకుని సినిమాలో భాగమే కనుక నేను ఆ సీన్‌ను లీక్ చేశాను అన్నట్లు ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది. ఆ వీడియోతో అమ్మాయిలకు మంచి మెసేజ్ ఇచ్చామని సైతం ఊర్వశి చెప్పుకొచ్చింది. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఊర్వశి సూచించింది.
గతంలోనూ నేను నటించిన సినిమాలో బాత్‌రూం సన్నివేశం ఉంది. ఘుస్పైతియే సినిమాలో కొత్తగా చేసింది ఏమీ లేదు. అయితే సీన్ సోషల్ మీడియా ద్వారా లీక్ కావడం చర్చనీయాంశం అయ్యింది. నిర్మాతల శ్రేయస్సు కోసం తాను కొన్ని సార్లు సోషల్ మీడియా ద్వారా అలాంటి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఘుస్పైతియే సినిమా అంటే తనకు ప్రత్యేకంగా ఇష్టం అని, అందుకే తాను ఆ సినిమా ప్రమోషన్స్ కోసం లీక్ వీడియోతో తనవంతు సహకారం అందించినట్లుగా ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది. డాకు మహారాజ్ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఊర్వశి మరిన్ని సినిమా ఛాన్స్‌లు దక్కించుకునే అవకాశం ఉంది.