12 కోట్లతో రోల్స్ రాయిస్.. ఊర్వశి బిల్డప్ చూశారా?
. 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేసిన మొదటి నటిగా ఊర్వశి రౌతేలా చరిత్ర సృష్టించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో కూడా చేరింది.
By: Tupaki Desk | 13 March 2025 12:06 AM ISTఖరీదైన కార్లు లగ్జరీ లైఫ్ స్టైల్‌కి సింబాలిక్. కేవలం స్టాటస్ సింబల్ మాత్రమే కాదు.. సంపాదన స్థాయిని ఇది ఎలివేట్ చేస్తుంది. ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ లాంటి 100 కోట్లు అందుకునే స్టార్లు రోల్స్ రాయిస్ ని నడపడం సముచితం. కానీ ఐటమ్ పాటలు, చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటున్న ఊర్వశి రౌతేలా ఏకంగా 12 కోట్లు ఖర్చు చేసి రోల్స్ రాయిస్ ని కొనుగోలు చేయడం ఆశ్చర్యపరిచింది.
ఇటీవలే 'డాకు మహరాజ్'లో 'దబిడి దిబిడి' పాటతో దేశవ్యాప్తంగా చర్చల్లోకొచ్చింది. బాలయ్య బాబు సమక్షంలో బోల్డ్ మూవ్స్ తో చెలరేగిన ఊర్వశి ఇచ్చిన ట్రీట్ గురించి చాలా చర్చ సాగింది. దీనిపై ప్రతిస్పందనలు ఘాటుగానే వచ్చాయి. అయినా ఈ పాటను కేవలం ఎన్బీకే మాస్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారని, శేఖర్ మాస్టర్ తో కలిసి ప్రతిదీ ప్లాన్డ్ గా చిత్రీకరించారని ఊర్వశి వివరణ ఇచ్చింది. ఈ పాట కోసం భారీగానే పారితోషికం అందుకుంది.
రూ. 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేసిన మొదటి నటిగా ఊర్వశి రౌతేలా చరిత్ర సృష్టించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో కూడా చేరింది. అదంతా సరే కానీ, ఊర్వశికి ఇంత పెద్ద ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది? అంటే.. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చూసుకున్నా కానీ ,తన ఆదాయం 8 కోట్లకు తగ్గదని అంచనా వేస్తున్నారు. ఊర్వశి సోషల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. అక్కడ ఒక్కో పోస్టింగుకు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. ర్యాంప్ వాక్ లు, రిబ్బన్ కటింగులు వగైరా వగైరా ఇతర ఆదాయ మార్గాలుగా ఉన్నాయి. ఆదాయం ఎలా ఉన్నా కానీ, తన స్థాయిని ఎలివేట్ చేసుకునేందుకే ఇప్పుడు ఇలా రోల్స్ రాయిస్ ని కొనుగోలు చేసిందని అంతా భావిస్తున్నారు.