Begin typing your search above and press return to search.

బాబాయ్ తర్వాత అబ్బాయితో.. దబిడి దిబిడి!

ముఖ్యమైన లేడీ పోలీస్ పాత్రలో ఊర్వశి రౌతేలా నటించారు. ముగ్గురిలోకి ఊర్వశి రౌతేలా పాత్ర ఎక్కువగా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 12:30 PM GMT
బాబాయ్ తర్వాత అబ్బాయితో.. దబిడి దిబిడి!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'డాకు మహారాజ్‌' సినిమా గత నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకలు ముందుకు వచ్చింది. డాకు మహారాజ్‌లో మొత్తం ముగ్గురు హీరోయిన్స్‌ నటించారు. బాలకృష్ణ భార్య పాత్రలో ప్రగ్యా జైస్వాల్‌ నటించగా, విలన్‌ భార్య పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ నటించారు. ముఖ్యమైన లేడీ పోలీస్ పాత్రలో ఊర్వశి రౌతేలా నటించారు. ముగ్గురిలోకి ఊర్వశి రౌతేలా పాత్ర ఎక్కువగా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది. అంతే కాకుండా ఆమెతో బాలకృష్ణకు ఉన్న దబిడి దిబిడి సాంగ్‌ ఓ రేంజ్‌లో కుమ్మేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన డాకు మహారాజ్ సినిమా ఊర్వశి రౌతేలాకు మంచి పాత్రలను తెచ్చి పెడుతుంది.

బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు మూడు సినిమాలకు కమిట్‌ అయిందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కనుక ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించడంతో పాటు ఒక ఐటెం సాంగ్‌లోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయి. బాబాయ్ బాలకృష్ణ సినిమాలో నటించిన వెంటనే అబ్బాయి ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న ఊర్వశి రౌతేలా చాలా లక్కీ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డాకు మహారాజ్‌ సినిమాలో ఈమె చేసిన దబిడి దిబిడి సాంగ్‌ పై కొందరు విమర్శలు చేశారు. ఇదేం కొరియోగ్రఫీ అంటూ కొందరు పెదవి విరిస్తే కొందరు మాత్రం డాన్స్ అదిరింది అంటూ ప్రశంసిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ దబిడి దిబిడి ట్రెండ్‌ అవుతోంది. దాంతో యూట్యూబ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక వ్యూస్ వచ్చిన పాటగా నిలిచింది. బాలయ్య బాబాయ్ తో దబిడి దిబిడి అంటూ సంచలనం రేపిన ఊర్వశి రౌతేలా అబ్బాయి ఎన్టీఆర్‌తో ఎలాంటి పాటతో కనిపిస్తుందో చూడాలి. ఎన్టీఆర్‌, నీల్‌ కాంబో మూవీలో ఊర్వశి రౌతేలా వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందుతున్న మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. 2026 జనవరి 9న ఎన్టీఆర్‌ - నీల్‌ల డ్రాగన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఒకవేళ ఆ డేట్‌ మిస్ అయితే 2026 సమ్మర్‌లో అయినా డ్రాగన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.